హైదరాబాద్

ఎన్‌టీఆర్ ‘నట వైభవం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, దివంగత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ‘ఎన్‌టీఆర్ నట వైభవ’ సదస్సు రసాంజలి సాంస్కృతిక సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మీ పాల్గొని ప్రసంగించారు. ఎన్‌టీఆర్ నటనలో జీవించేవాడని ఎలాంటి పాత్రనైనా అవలీలగా నటించి ప్రేక్షకులను మెప్పించే వాడని కీర్తించారు. ఆయన జయంతి వేడుకలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో సినీ విజ్ఞాన విశారద ఎస్‌వీ రామారావు, రచయిత్రి డా.కేబీ లక్ష్మీ, కవయిత్రి శశిబాల, సంస్థ అధ్యక్షుడు వై.మల్లికార్జునమ్ పాల్గొన్నారు.
వౌలిక సదుపాయాల కల్పనకు కృషి
మహేశ్వరం, మే 25: మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో వౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని గ్రామ సర్పంచ్ కర్రోళ్ల ప్రియాంక రాజేష్ అన్నారు. శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. పంచాయతీ పరిధిలో ప్రాంతాల్లో తాగు నీరు, అండర్ డ్రైనేజీలు, వీధి దీపాలు, పరిశుభ్రత తదితర పనులు పరిష్కారిస్తామని వివరించారు. పలువురు యువకులు మాట్లాడుతూ సులభ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేయాలని, బస్‌స్టాండ్ నిర్మాణం మర్కెట్ యార్డు, వీధిదీపాలు మంచి నీటి సమస్యలు పరిష్కారించాలని గ్రామ సభ దృష్టికి తీసుకుపోయారు. సంద్పించిన సర్పంచ్ ప్రియాంక అధికారుల వివరించి సమస్యలు పరిష్కారించేందుకు కృషి చేస్తాని అన్నారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ దోమ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు, టీఆర్‌ఎస్ నాయకుడు కర్రోళ్ల చంద్రయ్య ముదిరాజ్ పాల్గొన్నారు.
అలరించిన సినీ సంగీత విభావరి
కాచిగూడ, మే 25: పద్మశ్రీ డా. ఎన్‌టీఆర్ జయంతి సందర్భంగా బృందావనం సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి శనివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు.
ప్రముఖ గాయకుడు డీ.ఎ.మిత్ర నిర్వహణలో గాయనీ, గాయకులు బండపాటి శ్రీనివాస్, గాయత్రి, జగద్ధాత్రి అలపించిన సినీ గీతాలు అలరించాయి. సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు వై.సుబ్రహ్మణ్యం, నూకల ప్రభాకర్ పాల్గొని అభినందించి సత్కరించారు.
పుస్తె మెట్టెలకు ఆర్థికసాయం
మేడ్చల్, మే 25: మండలంలోని గౌడవెళ్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జగన్‌రెడ్డి ఓ నిరుపేద కుటుంబానికి చెందిన యువతి వివాహం కోసం పుస్తె మెట్టెల కోసం ఆర్థికసాయం అందజేసి తన ఉదారతను మరోమారు చాటుకున్నారు. రూ.10వేల నగదును అందజేశారు.

పారిశుద్ధ్యంపై అవగాహన
షాద్‌నగర్, మే 25: పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ అన్నారు. శనివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అగ్గనూరి విశ్వం అధ్యక్షతన పారిశుద్ధ్యంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ జూన్ 5న నిర్వహించనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కాలనీల్లోని వార్డుల్లో మురుగు కాలువలను శుభ్రం చేయడంతోపాటు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని అన్నారు. మురుగునీరు రోడ్లపై వ్రహించకుండా ప్రతి వార్డులో తప్పని సరిగా మురుగుకాలువల నిర్మాణాలు చేపట్టేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో షాద్‌నగర్ పురపాలక సంఘం చైర్మన్ అగ్గనూరి విశ్వం, కమిషనర్ శరత్‌చంద్ర, మున్సిపల్ సిబ్బంది, పట్టణ మహిళా సమాఖ్య సభ్యులు, టీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.
దివ్యాంగ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా మహిళకు అవకాశం కల్పించాలి
ఖైరతాబాద్, మే 25: తెలంగాణ రాష్ట్ర దివ్యాంగ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా మహిళకు అవకాశం కల్పించాలని తెలంగాణ వికలాంగుల ఆత్మగౌరవ ఐక్యవేదిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వేదిక నాయకులు కిరణ్‌కుమార్, సతీష్, పద్మప్రియ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కార్పోరేషన్‌ను ఏర్పాటు చేశారని అన్నారు. ప్రస్తుతం కార్పోరేషన్ చైర్మన్‌గా కొనసాగుతున్న వాసుదేవరెడ్డి పదవీకాలం ముగుస్తున్నందున, ఈ సారి మహిళకు అవకాశం ఇవ్వడం ద్వారా దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. దివ్యాంగుల సమస్యల తెలిసి ఉండి, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కలిగి ఉన్న వారికి ఇస్తే ప్రభుత్వ లక్ష్యం సైతం నెరవేరుతుందని అన్నారు.