హైదరాబాద్

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో మేఘన ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం నాడు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్ష ఫలితాల్లో వేములపల్లి మేఘన బైపిసిలో 440 మార్కులకు గానూ 433 మార్కులు సాధించి నగర టాపర్‌గా నిలిచింది. మేఘన ఇంగ్లీషులో 95, సంస్కృతంలో 98 మార్కులు సాధించింది. మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో వందకు వంద శాతం మార్కులు వచ్చాయి. బోటనీలో 60/60, జువాలజీ 60/60, ఫిజిక్స్‌లో 60/60, కెమిస్ట్రీలో 60/60 సాధించింది. మేఘన ప్రతిభ పట్ల కాలేజీ యాజమాన్యం, సహ విద్యార్ధులు అభినందనలతో ముంచెత్తారు.