హైదరాబాద్

కేవీ కృష్ణకుమారికి పురస్కారం ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, : శ్రీత్యాగరాయ గానసభ స్థాపక సభ్యురాలు కళా లలిత జయంతి సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత్రి డా.కేవీ కృష్ణకుమారికి సార్మక పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య పాల్గొని పురస్కారం ప్రదానం చేశారు.
కళా కుటుంబం కళా రంగానికి ఎంతో సేవ చేస్తుందని కొనియాడారు. ఎంతో మంది కళాకారులకు శ్రీత్యాగరాయ గానసభ వేదికలో కల్పించి ప్రొత్సహించడం అభినందనీయమని అన్నారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో సాహితీవేత్త పొత్తూరి విజయలక్ష్మీ, గానసభ కమిటి సభ్యురాలు హైమ పాల్గొన్నారు.