హైదరాబాద్

తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహకవి శ్రీశ్రీ అని ప్రముఖ సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం అన్నారు. శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా ప్రముఖ కవి డా.నాళేశ్వరం శంకరంకు ‘శ్రీశ్రీ’ స్మారక పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం కళానిలయం సాంస్కృతిక సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వోలేటి పార్వతీశం పాల్గొని పురస్కారం ప్రదానం చేశారు. చిన్నతనం నుంచే శ్రీశ్రీ తన రచనలు చేశారని పేర్కొన్నారు. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షునిగా అనేక మంచి కవులను ప్రోత్సహించారని తెలిపారు. ప్రముఖ గాయనీ సంయుక్త నిర్వహణలో సినీ సంగీత విభావరి అలరించింది. మధుర గాయనీ హైమవతి భీమన్న సభాధ్యక్షత వహించగా గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, విమల సాహితి సమితి అధ్యక్షుడు జల్ది విద్యాధర రావు, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సురేందర్, పుష్పలత పాల్గొన్నారు.