హైదరాబాద్

కళలు, కళాకారులను ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: కళలు, కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. విద్యారత్న బింగి మల్లేశ్వరి మెమోరియల్ ట్రస్ట్, నార్త్ దిల్లీ కల్చరల్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ‘బాలపభ్ర’ అవార్డ్సుతో పాటు జాతీయ పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రోశయ్య పాల్గొని డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఇనిట్యూషన్ చైర్మన్ డా.ఎస్‌ఎల్ నారాయణకు జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. నారాయణ తమ ఇనిట్యూషన్‌తో అనేక మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యనందిండంతో పాటు వివిధ సేవ కార్యక్రమాలను నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు. బింగి నరేందర్ గౌడ్ తన తల్లి పేరిట మెమోరియల్ ట్రస్ట్‌ను స్థాపించి కళాకారులను ప్రొత్సహించడం అభినందనీయమని అన్నారు. కళాకారులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సంస్థ అధ్యక్షుడు బింగి నరేందర్ గౌడ్ పాల్గొన్నారు.
అలరించిన సినీ సంగీత విభావరి
కాచిగూడ, జూన్ 11: స్టార్ సాంస్కృతి సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి మంగళవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సంస్థ అధ్యక్షుడు ఓరుగంటి రామకృష్ణ పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కరించారు. ప్రముఖ గాయనీ రేణుక నిర్వహణలో గాయనీ, గాయకులు అలపించిన సినీ గీతాలు అలరించాయి.