హైదరాబాద్

సమన్వయంతో విపత్తులను ఎదుర్కొందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో జనజీవనంతో ముడిపడి ఉన్న ముఖ్యమైన ప్రభుత్వ శాఖలన్నీ చక్కటి సమన్వయంతో విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లు వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ అధ్యక్షతన మంగళవారం ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. జీహెచ్‌ఎంసీ, మెట్రోరైలు, విద్యుత్ ఇతర విభాగాల వద్ద అన్ని కలిపి దాదాపు 300 విపత్తుల నివారణ ప్రత్యేక బృందాలున్నట్లు తెలిపారు. నగరంలో ఎలాంటి విపత్తులు సంభవించినాఅన్ని విభాగాల అధికారులు కలిసి సమన్వయంతో వ్యవహారించి, ఎంతటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తామున్నామన్న విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించేలా వ్యవహరించాలని సూచించారు. ప్రధానంగా గ్రేటర్ పరిధిలో 195 ప్రాంతాలు ముంపునకు గురవుతున్నట్లు గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో ముంపు నివారణ చర్యలు చేపట్టినట్లు కమిషనర్ వెల్లడించారు. వర్షాల సమయంలో ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టిని సారించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా మ్యాన్‌హోళ్లు, క్యాచ్‌పిట్‌లను మరోసారి తనిఖీ చేసి, ఆయా ప్రాంతాల్లోని నాలాల్లో పూడిక, వ్యర్థాలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. మెట్రోరైలు ఎండీ డా.ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ మెట్రోరైలు మార్గంలో 95 హోర్డింగ్‌లు ప్రమాదకరంగా ఉన్నాయని సూచించగా, ఇప్పటికే ఈ మార్గంలో హోర్డింగ్‌లను ఏర్పాటు చేయకుండా నిషేధం విధించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. మెట్రోమార్గంలో ప్రమాదకరంగా మారిన మరికొన్నింటిని తొలగించాలని హోర్డింగ్ ఏజెన్సీలను ఆదేశించినట్లు తెలిపారు. హైదరాబాద్ పోలీసు కమిష్నరేట్ పరిధిలోని 150 ప్రాంతాల్లో వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ అనిల్‌కుమార్ సూచించారు. మెట్రోరైలు వంతెనలపై నుంచి వర్షపు నీరు రోడ్డుపైకి ప్రవహిస్తుందని, వీటిని నివారించాలని సూచించారు. నగరంలో ఇప్పటికే రోడ్ల తవ్వకాలను నిషేధించామని, ఇప్పటికే అనుమతులు తీసుకున్న ఏజెన్సీలు రోడ్ల తవ్వకాలు చేపట్టిన తమ పనులను వారం రోజుల్లో పూర్తి చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జలమండలి, రెవెన్యూ, ట్రాన్స్‌కో, వాతావరణ శాఖ, నీటి పారుదల, ఫైర్ సర్వీసు, ఆర్టీసీ, సైబరాబాద్ డీసీపీ విజయ కుమార్, జాయింట్ కలెక్టర్ రవి, జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి హాజరయ్యారు.
రూ.17.50లక్షల పరికరాల పంపిణీ
వర్షాకాలం సీజన్‌లో ఆకస్మిక వర్షాలు, ఇతర విపత్కర సమయంలో సహాయక చర్యల నిమిత్తం వినియోగించేందుకు అవసరమైన సుమారు రూ. 17.50లక్షల విలువైన పరికరాలను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగానికి కమిషనర్ దాన కిషోర్ అందజేశారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అదనపు సీపీ అనిల్‌కుమార్, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.
ఆగస్టు 15 వరకు
హోర్డింగ్‌లపై నిషేధం
వర్షాకాలం కష్టాల నివారణపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. జీహెచ్‌ఎంసీలోని అన్ని విభాగాలతో పాటు జనజీవనాన్ని ప్రభావితం చేసే ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయాన్ని పెంపొందించుకుని విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేయటంలో బల్దియా బిజీగా ఉంది. ఇప్పటికే వర్షాకాలం తరుచూ కురిసే వర్షాలకు కొట్టుకుపోయే రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు ఇప్పటికే రోడ్ల తవ్వకాలపై నిషేధం విధించింది. ఇపుడు తాజాగా ఈ నెల 15వ తేదీ నుంచి నగరంలో చేపట్టే కొత్త భవనాల్లో సెల్లార్ల తవ్వకాలను నిషేధించాలని అధికారులు నిర్ణయించారు. గతంలో వర్షాకాలంలో రెండు, మూడు సెల్లార్లను తవ్వటంతో సెల్లార్లను తవ్విన ప్రాంతానికి పక్కనే ఉన్న భవనాల ప్రహరీగోడలు, మట్టి పెళ్లలు కూలి పలువురు కూలీలు ప్రాణాలు కొల్పోయిన ఘటనలు సైదాబాద్ పీఅండ్‌టీ కాలనీ, సికిందరాబాద్ సంగీత్ థియేటర్ల వద్ద సంభవించటంతో ఈ సారి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు సెల్లార్ల తవ్వకాలపై నిషేధం విధించారు. ఈనెల 15కు ముందు సమర్పించుకున్న నిర్మాణ అనుమతులకు మాత్రమే సెల్లార్ల తవ్వకాలను అనుమతించాలని, ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులకు సంబంధించి సెల్లార్ల తవ్వకాలను అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు. ఇటీవల బలమైన ఈదురుగాలులతో చిరుజల్లులు మొదలుకుని ఓ మోస్తరుగా వర్షాలు కురవటంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో పలు హోర్డింగ్ పడి, కొందరు ప్రాణాలను కొల్పోయిన సంఘటనలు విధితమే. ఈ క్రమంలో కొత్త హోర్డింగ్‌ల ఏర్పాటుపై కూడా ఆగస్టు 15 వరకు అధికారులు నిషేధం విధించారు. ఈ మేరకు మంగళవారం జరిగిన సిటీ సమన్వయ కమిటీలో కూడా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.