హైదరాబాద్

కూల్చివేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వర్షాకాలం సమీపిస్తోంది..ఈసారి భారీ వర్షాలు దంచికొట్టే అవకాశమున్నట్లు ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి. వానాకాలం కష్టాలను నివారించటంతో పాటు ప్రాణ నష్టం జరగకుండా జీహెచ్‌ఎంసీ ముందుజాగ్రత్తతో వ్యవహరిస్తోంది. నిన్నమొన్నటి వరకు నగరంలోని 30 సర్కిళ్లలోని శిథిలావస్థకు చేరుకున్న పాతకాలపు భవనాలను గుర్తించిన అధికారులు, అందులో పటిష్ట చర్యలు చేపట్టలేనంత శిథిలావస్థకు చేరుకున్న భవనాలను గుర్తించి, కూల్చివేసే పనులకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మంగళవారం ఒక్కరోజే 11 భవనాలను కూల్చివేసినట్లు, మరో భవనాన్ని సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గ్రేటర్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 750 శిథిల భవనాలున్నట్లు గుర్తించామని సిటీ చీఫ్ ప్లానర్ ఎస్. దేవేందర్‌రెడ్డి వెల్లడించారు. వీటిలో దాదాపు 200 పురాతన, శిథిల భవనాలను ఇటీవలే గుర్తించామని, వీటిని కూల్చివేసే పనులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ ఇళ్లకు పూర్తి స్థాయిలో మరమ్మతులను చేపట్టి, పటిష్ట చర్యలు చేపట్టాలని కూడా ఇళ్ల యజమానులకు నోటీసులు జారీ చేశామని ఆయన వివరించారు. వర్షాకాలంలో విపత్తుల నివారణలో భాగంగా ఈ భవనాలను గుర్తించామని, ఈ భవనాలపై ఇంజనీరింగ్ విభాగాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవటం, అత్యంత ప్రమాదకరంగా మారిన భవనాలను గుర్తించి కూల్చివేసేందుకు టౌన్‌ప్లానింగ్ విభాగం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసిందని తెలిపారు. ఈ రకంగా ప్రమాదకరంగా మారిన మరికొన్ని భవనాల్లో నేటికీ నివాసముంటూ, అవి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయని నోటీసులు జారీచేసినా, వాటిని ఖాళీ చేసేందుకు అందులో ఉంటున్న కుటుంబాలు నిరాకరిస్తుండటంతో, వారికి కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అత్యంత ప్రమాదకరంగా మారిన భవనాల్లోకి ఎవరూ వెళ్లకుండా చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. 2017లో 199 భవనాలను కూల్చివేయగా, 15 భవనాలను సీజ్ చేశామని, గత సంవత్సరం 182 శిథిల భవనాలను కూల్చివేయగా, మరో 26 భవనాలను సీజ్ చేయటం జరిగిందని, ఈ సంవత్సరం జనవరి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు 382 శిథిల భవనాలను కూల్చివేసి, 26 భవనాలను సీజ్ చేయటం జరిగిందని వెల్లడించారు.