హైదరాబాద్

గాయనీ కౌసల్యకు పురస్కారం ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: ప్రముఖ సినీ గాయకుడు ఎస్‌పీ బాల సుబ్రహ్మణ్యం జన్మదినం సందర్భంగా ప్రముఖ గాయనీ కౌసల్యకు పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రజానటి డా.జమున పాల్గొని కౌసల్యకు పురస్కారం ప్రదానం చేశారు. ఎస్‌పీ బాల సుబ్రహ్మణ్యం జన్మదినోత్సవ సందర్భంగా గాయనీ కౌసల్యకు పురస్కారం ప్రదానం చేయడం అభినందనీయమని అన్నారు. కౌసల్య గాయనీగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాక్షించారు. గాయనీ ఆమని నిర్వహణలో గాయనీ, గాయకులు వెంకట రావు, సుభాష్, శివ కుమార్, అనుపమ అలపించిన సినీ గీతాలు అలరించాయి. అక్కినేని నాగేశ్వర రావు నాటక కళ పరిషత్ అధ్యక్షుడు సారిపల్లి కొండల రావు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో సినీ దర్శకుడు రేలంగి నరసింహా రావు, నటి గీతాంజలి, సంగీత దర్శకుడు శశి ప్రీతమ్, కళ పత్రిక సాంపదకుడు మహ్మద్ రఫీ, సంస్థ అధ్యక్షురాలు ఆమని పాల్గొన్నారు.