హైదరాబాద్

బహుముఖ ప్రజ్ఞాశాలి చిలకమర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: బహుముఖ ప్రజ్ఞాశాలి చిలకమర్తి లక్ష్మీ నరసింహం అని పలువురు వక్తలు కొనియాడారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం వర్దంతి సభ శ్రీమాత సద్గురు మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం శ్రీకృష్ణాదేవరాయ తెలుగు భాషా నిలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య టీ.గౌరీశంకర్ పాల్గొని చిలకమర్తి లక్ష్మీ నరసింహం చిత్ర పటానికి నివాళి అర్పించారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం చిన్నతనం నుంచే అనేక రచనలు చేశారని పేర్కొన్నారు. తెలుగు నాట అధునిక భావాల వికాసానికి కృషి చేశారని కీర్తించారు. ప్రముఖ కవి సుధామ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి రాజేంద్ర ప్రసాద్, లయన్ పీఎన్ మూర్తి, భక్తి భజన ప్రచార పరిషత్ అధ్యక్షుడు జె ఎస్ ప్రసాద్, కమల పాలగుమ్మి, చిలకమర్తి గోపీకృష్ణ, కళాపీఠం అధ్యక్షుడు రత్నాకర శర్మ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ‘అన్నమయ్య పదార్చన’
కాచిగూడ, జూన్ 17: మహతి సంగీత కళానిలయం, రైట్‌వే, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ‘అన్నమయ్య పదార్చన’ కార్యక్రమం సోమవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి అన్నమాచార్య ప్రాజెక్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కామిశెట్టి శ్రీనివాసులు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, డబ్బింగ్ అర్టిస్ట్ కృష్ణవేణి, నటి చెల్లె స్వప్న, మిమిక్రీ అర్టిస్ట్ బుర్రా మోహన కృష్ణ, సంస్థ అధ్యక్షురాలు పద్మావతి పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కరించారు. మహతి సంగీత కళానిలయం విద్యార్థులు అలపించిన అన్నమయ్య పదార్చన అలరించాయి.