హైదరాబాద్

ప్రగతి భవన్ ముట్టడికి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: సెలెక్టెడ్ టీచర్లకు తక్షణమే పోస్టింగ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పలువురు టీచర్లు.. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. మంగళవారం ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్ ముట్టడికి వందలాదిగా నిరుద్యోగులు వస్తున్నట్టు తెలుసుకన్న పోలీసులు ఎక్కడి వారిని అక్కడే అరెస్టు చేశారు. బీసీ సంఘం నేత గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలోని పలువురు పోలీసుల క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకొని నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోనికి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

‘కలశ’లో
మెహ్రిన్ సందడి
ఖైరతాబాద్, జూన్ 18: బంజారాహిల్స్‌లోని కలశ షోరూమ్‌లో నటి మెహ్రిన్ సందడి చేశారు. షోరూమ్‌లో ఈనెల 27 నుంచి ఏర్పాటు చేయనున్న సిగ్నేచర్ బ్రెడల్ లాజ్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. సాంప్రదాయ తాను ఎంతో ఇష్టమని, ప్రత్యేక వేడుకల్లో సాంప్రదాయ ఆభరణాలను ధరిస్తానని పేర్కొన్నారు. సాంప్రదాయ, డిజైనరీ మేళవింపుతో ప్రత్యేక ఆభరణాలను ప్రదర్శించనున్నట్టు సంస్థ డైరెక్టర్ అభిషేక్ తెలిపారు.

అంతర్జాతీయ జూనియర్ షూటింగ్‌లో రాణించిన రాష్ట్ర క్రీడాకారులు
హైదరాబాద్, జూన్ 18: ఫిన్‌లాండ్‌లోని ఓరిమాటీల్లాలో జరిగిన అంతర్జాతీయ జూనియర్ షాట్‌గన్ కప్‌లో తెలంగాణ షూటర్‌లు అద్భుతంగా రాణించి పతకాలు సాధించారు. ఈనెల 3 నుంచి 10వరకు ఫిన్‌లాండ్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన అయూష్ రుద్రరాజు జూనియర్ పురుషులు స్కిట్ విభాగంలో స్వర్ణం, పురుషుల టీమ్ ఈవెంట్‌లో రజత పతకం సాధించాడు. జూనియర్ మహిళల టీమ్ ఈవెంట్ స్కీట్ విభాగంలో జరిగిన పోటీలో రాష్ట్ర షూటర్ జహేరా ముఫాదాల్ దేశ్‌వలా రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకుంది. అంతర్జాతీయ షాట్‌గన్ కప్ పోటీలో పతకాలు సాధించిన అయూష్, జహేరాను తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) వీసీ, ఎండీ ఏ.దినకర్ బాబు అభినందించి సత్కరించారు.