హైదరాబాద్

భూగర్భ డస్ట్‌బిన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో చెత్తాచెదారం బయటకు కన్పించకుండా, ఎపుడైనా వర్షం కురిసి, చెత్త తడిసినపుడు దుర్వాసన బయటకు రాకుండా ఉండేందుకు వీలుగా భూగర్భ డస్ట్‌బిన్లను ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ వెల్లడించారు. మంగళవారం గాజులరామారం సర్కిల్‌లోని రంగానగర్‌కాలనీలో నిర్వహించిన ‘సాఫ్ హైదరాబాద్-షాన్‌దార్ హైదరాబాద్’ కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. ఆ తర్వాత కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయు ఆడిటోరియంలో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్‌ల డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు, సాఫ్ హైదరాబాద్ - షాన్‌దార్ హైదరాబాద్ లొకేషన్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమావేశంలో కమిషనర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో నిర్దారించిన 2500 ఇళ్లలో జూలై మాసం చివరి కల్లా తడి, పొడి చెత్తను వేరు చేసి, స్వచ్ఛ ఆటోలకు అందించటం, ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించటం, ఇతర స్వచ్ఛ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించంతో ప్రత్యేక గుర్తింపు సాధించాలని అన్నారు. భూగర్భ డస్ట్‌బిన్లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఇదివరకే ఉందని, దీన్ని అమలు చేసేందుకు ప్రతి సర్కిల్‌లో రెండింటిని ఏర్పాటు చేసేందుకు వీలుగా డిప్యూటీ కమిషనర్లు స్థలాలను గుర్తించాలని కమిషనర్ ఆదేశించారు. దీంతో పాటు చెత్తను నగరం నుంచి వీలైనంత త్వరితగతిన తరలించేందుకు వీలుగా ఇపుడున్న స్వచ్ఛ ఆటోలకు అదనంగా మరో నాలుగు నెలల్లో 500 సీఎన్‌జీ వాహనాలను అందుబాటులోకి తేనున్నట్లు కమిషనర్ తెలిపారు. నగరంలో నూటికి నూరు శాతం స్వచ్ఛత, పరిశుభ్రతను సాధించేందుకే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఎక్కడైనా స్వచ్ఛతకు భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇందుకు లొకేషన్ అధికారులకు అధికారాలిస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై ప్రజల్లో అవగాహన పెంచటంతో పాటు ప్రతి ఇంటికి క్లాత్ బ్యాగ్‌ను అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.