హైదరాబాద్

ఒకేషనల్ బ్యాచ్‌కి శిక్షణ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శ్రీసత్యసాయి సేవా సంస్థలు కోఠి సమితి ఆధ్వర్యంలో 11వ బ్యాచ్‌కి ఒకేషనర్ కోర్సుల్లో శిక్షణ ప్రారంభించినట్లు సమితి అధ్యక్షుడు పీ.విశే్వశ్వర శాస్ర్తీ తెలిపారు. ఇదివరకే నాలుగు నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న 18 మందికి ఉస్మాన్‌గంజ్‌లోని శిక్షణ కేంద్రంలో సర్ట్ఫికెట్లు ప్రదానం చేసి, కొత్త బ్యాచ్‌కి శిక్షణను ప్రారంభించినట్లు తెలిపదారు. తెలంగాణ రాష్ట్ర మహిళా సేవాదళ్ కోఆర్డినేటర్ కే.సుధ ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి సర్ట్ఫికెట్లను అందజేశారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వారికి ఆసక్తి ఉన్న ఒకేషనల్ కోర్సుల్లో శ్రీసత్యసాయి సేవా సంస్థలు కోఠి సమితి శిక్షణ ఇవ్వటం అభినందనీయమని అన్నారు. గురువారం నుంచి కొత్త బ్యాచ్‌కి పూర్తి స్థాయిలో శిక్షణను ఇవ్వనున్నట్లు విశే్వశ్వర శాస్ర్తీ తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ వ్యాపార వేత్త ప్రేమసాయి, మహంకాళీ నర్సింహా రావు, శైలేశ్వరి, కల్పనా, చల్లమల్ల లక్ష్మారెడ్డి, వెంకటరావు, రమాదేవి, సాయిలక్ష్మి పాల్గొన్నారు.