హైదరాబాద్

సామాజిక చైతన్యం భక్తి, సన్మార్గాలకు ఆయువుపట్టు హరికథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: శతాబ్దాలుగా మానవ సమాజాన్ని సన్మార్గంలో నడిపించి, సాహిత్య సంగీత సంగమంగా వర్ధిల్లిన తెలుగు వారి సంప్రదాయ కళారూపం హరికథా అని తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు అన్నారు. ప్రముఖ హరికథా భాగవతార్ టీ.కొమరయ్యచే ‘సీతారామ కళ్యాణం’ హరికథా గానం శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో గురువారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వకుళాభరణం కృష్ణమోహన రావు పాల్గొని ప్రసంగించారు. కళారూపం నాటి సమాజాన్ని ఎంతోగానో ప్రభావితం చేసిందని అన్నారు. ప్రజలను భర్తి, సన్మార్గాలలో నడిపంచడమే కాకుండా, మూఢ విశ్వాసాలు, సాంఘిక దురాచారాల బారినుండి కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషించిందని పేర్కొన్నారు. కళారుపాల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో విమల సాహితీ సమితి అధ్యక్షుడు జల్ది విద్యాధర రావు, అభినందన భవానీ పాల్గొన్నారు.
భవానీదేవి రచించిన పుస్తకావిష్కరణ
కాచిగూడ, జూన్ 20: ప్రముఖ రచయిత్రి డా.సీ.్భవానీదేవి రచించిన ‘స్వాతంత్య్రానంతర తెలుగు, హిందీ కవిత్వంలో స్ర్తి’ పుస్తకావిష్కరణ సభ కినె్నర ఆర్ట్ థియేటర్స్, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత ఆచార్య ఎన్.గోపీ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. భావానీదేవి ఎంతో పరిశోధన చేసి పుస్తకాన్ని రచించారని పేర్కొన్నారు. దేశ, భాష సమైక్యతకు భావానీదేవి పుస్తకాలు దోహదపడుతాయని తెలిపారు. సమాజంలో స్ర్తి పరిస్థితి, వారి స్థితిగతులను పుస్తక రూపంలో తెలియజేశారని అన్నారు. ప్రముఖ సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఆచార్య ఎస్‌వీ రామారావు, రచయిత్రి ఎస్.స్వయంప్రభు, డా.ఎస్.రఘు, డా.పీ.జ్యోతి, సంస్థ కార్యదర్శి మద్దాళి రఘురామ్ పాల్గొన్నారు.
అలరించిన సినీ సంగీత విభావరి
కాచిగూడ, జూన్ 20: ఆర్‌ఆర్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి గురువారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. ప్రముఖ గాయనీ రేణుక నిర్వహణలో గాయనీ, గాయకులు రైల్వే శ్రీ్ధర్, శశి, గోవింద్, మోహన్, రాజు, శ్రీదేవి, అభిఖ్య అలపించిన సినీ గీతాలు అలరించాయి. కార్యక్రమానికి గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి రాజేంద్ర ప్రసాద్, దైవజ్ఞశర్మ పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కరించారు.