హైదరాబాద్

చైనా మాంజాలో చిక్కుకున్న గద్ద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఓ చెట్టుకు చుట్టి ఉన్న నిషేధిత చైనా మాంజాలో చిక్కుకున్న ఓ గద్దను జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ రెస్క్యూ టీం రక్షించింది. కొద్ది రోజుల క్రితం నల్లగండ్ల చెరువులోని నీటిలో చిక్కుకున్న జింకను, మూడు రోజుల క్రితం ఆల్విన్‌కాలనీలోని ఓ సెప్టిక్ ట్యాంక్‌లో ప్రమాదవశాత్తు పడి, పదిరోజుల పాటు అందులో చిక్కుకుపోయిన ఆవును రక్షించిన డిజాస్టర్ రెస్క్యూ టీం ఇపుడు ఓ గద్దను రక్షించింది. అసెంబ్లీ ముందున్న ఓ చెట్టుపై పతంగులు ఎగురవేసే చైనా మాంజా కాలికి చుట్టుకుని ఓ గద్ద వేలాడుతూ కన్పించింది. ఈ విషయాన్ని గ్రహించిన అసెంబ్లీ సిమ్బంది జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. గన్‌పార్కు సమీపంలో విధి నిర్వహణలో ఉన్న టీం హుటాహుటీన అక్కడకు చేరుకుని లాడర్ సహాయంతో చెట్టు ఎక్కి, గద్ద కాలికి చుట్టుకున్న మాంజాను తొలగించి, దాన్ని రక్షించారు. జీహెచ్‌ఎంసీ ఇటీవలే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం ఈ రకంగా ఇప్పటి వరకు పలు మూగజీవాల ప్రాణాలను రక్షించటం పట్ల నగరవాసులు, అసెంబ్లీ, జీహెచ్‌ఎంసీ అధికారులు టీంను అభినందించారు.