హైదరాబాద్

బీసీ ఓటర్ల గణన మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలోని పలు స్థానిక సంస్థల పదవీకాలం త్వరలో ముగియనుండటంతో, మళ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా రిజర్వేషన్ల ఖరారు కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో బీసీ ఓటర్ల గణన జరగనుంది. ఇప్పటికే సర్కారు ఆదేశాలు జారీ చేయటంతో బీసీ ఓటర్ల గుర్తింపునకు అవసరమైన అధికారులను గురువారం నియమించినట్లు తెలిసింది. ఈ నెల 22వ తేదీ శుక్రవారం నుంచి మహానగరంలోని అన్ని ప్రాంతాల్లో బీసీ ఓటర్లను గుర్తించేందుకు గాను ప్రత్యేకంగా ఇంటింటికి సర్వేను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి గురువారం జీహెచ్‌ఎంసీలో అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సర్వే వచ్చే నెల 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే నెల 6వ తేదీన నగరంలోని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆఫీసు, ఆర్డీఓ, ఎమ్మార్వో ఆఫీసుల్లో ముసాయిదాను సిద్దం చేసి, అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. దీంతో పాటు రాజకీయపార్టీలకు కూడా ఓ ప్రతిని అందజేయాలని ఎన్నికల విభాగం ఆదేశించింది. ముసాయిదాపై వచ్చే నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి, వాటిని వచ్చే నెల 12వ తేదీ నుంచి 14 వరకు తేదీ వరకు మూడురోజుల పాటు పరిశీలించి, పరిష్కరించాలని ఎన్నికల విభాగం ఆదేశించింది. తదనంతరం ఓ బీసీ ఓటర్ల జాబితాపై వచ్చే నెల 15,16 తేదీల్లో రెండురోజుల పాటు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి, తుది దశగా బీసీ ఓటర్లను మార్కింగ్ చేయనున్నట్లు ఎన్నికల విభాగం సూచించింది. నగరంలోని 30 సర్కిళ్లలోని గురించిన బీసీ ఓటర్ల జాబితాను 18వ తేదీన అన్ని వార్డు ఆఫీసుల్లో అందుబాటులో ఉంచి, 19న తుది జాబితాను విడుదల చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ మొత్తం ప్రక్రియను 28రోజుల్లో పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. శిక్షణ కార్యక్రమానికి హాజరైన కమిషనర్, అదనపు కమిషనర్ జయరాజ్ కెనడీ, జాయింట్ కమిషనర్ (ఎన్నికలు) పంకజ పాల్గొన్నారు.