హైదరాబాద్

లలిత సంగీత స్వరకర్త అమృతవల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: లలిత సంగీత స్వరకర్తగా అమృతవల్లి ఎంతో పేరు సంపాధించుకుందని అన్నమాచార్య ప్రాజెక్టు వ్యవస్ధాపక సంచాలకుడు కామిశెట్టి శ్రీనివాసులు అన్నారు. అన్నమయ్య జయంతి సందర్భంగా మధుర గాయనీ అమృతవల్లికి ఆత్మీయ సత్కార కార్యక్రమం రాగరాగిణి ఆర్ట్స్ అసోసియేషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కామిశెట్టి శ్రీనివాసులు పాల్గొని ప్రసంగించారు. అమృతవల్లి అనేక పోటీలలో పాల్గొని ఎన్నో బహుమతులను గెలుచుకున్నారని పేర్కొన్నారు. అమృతవల్లి లలిత సంగీత స్వరకర్తగా అత్యంత ప్రతిభ కనబరిచారని కొనియాడారు. భవిష్యత్‌లో మరిన్ని పాటలను అందించాలని ఆకాక్షించారు. గాయకులు ఎంవీ రమణ కుమారి, వందన, అమృతవల్లి అలపించిన అన్నమాచార్య సంకీర్తనలు అలరించాయి. కళారత్న సీ.రామకృష్ణ సభాధ్యక్షత వహింగా గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, లలిత సంగీత దర్శకుడు డా.ఎం.చిత్తరంజన్, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎంవీ రమణకుమారి, ఎంవీ సుబ్బలక్ష్మీ పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవాలి
కాచిగూడ, జూన్ 23: తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జాతీయ సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ మాడభూషి శ్రీ్ధర్ అన్నారు. కళానిలయం సంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ‘బంగారు తెలంగాణ - నాట్య నజరాన’ పేరిట వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి తెలంగాణ సేవా రత్న పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాడభూషి శ్రీ్ధర్ పాల్గొని తెలంగాణ సేవా రత్న పురస్కారాలతో పాటు నృత్య గురువులకు తెలంగాణ నాట్య కళా సరస్వతి అవార్డులను ప్రదానం చేశారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా కళాకారులు ప్రదర్శించిన నృత్యలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని కీర్తించారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని గుర్తించి వారికి పురస్కారాలను ప్రదానం చేయడం అభినందనీయమని అన్నారు. మల్కాజ్‌గిరి జడ్జీ జస్టిస్ మధుసూదన్ రావు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఓబీసీ కమిషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, జబర్దస్త్ ఫేమ్ కొమురం, మహ్మద్ షాబుద్దీన్, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సురేందర్, పుష్పలత పాల్గొన్నారు.
అలరించిన సినీ సంగీత విభావరి
కాచిగూడ, జూన్ 23: బృందావనం సాంస్కృతిక సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఘంటసాల ఆపాత మధుర గీతాలు సినీ సంగీత విభావరి ఆదివారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్టు మతుకుపల్లి మనోహర్, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సంస్థ అధ్యక్షుడు నూకల ప్రభాకర్ పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కారించారు. గాయనీ, గాయకులు రామ సుబ్రహ్మణ్యం, ఉమ, రవళి, శశాంక్ అలపించిన సినీ గీతాలు అలరించాయి.