హైదరాబాద్

కలియుగ శ్రీమన్నారాయుణుని అవతారమే శ్రీవేంకటేశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: కలియుగ శ్రీమన్నారాయణుని అవతారమే శ్రీవేంకటేశ్వర స్వామి అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి అన్నారు. ప్రముఖ నృత్య గురువు హంస పురస్కార గ్రహీత డా.మద్దాళి ఉషాగాయత్రి శిష్య బృందంచే ‘ఇలవైకుంఠం’ కూచిపూడి నృత్య విభావరి నృత్య కినె్నర సంస్థ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గండికోట శ్రీదేవి మాట్లాడుతూ వేంకటేశ్వర స్వామి నిలయమైన సప్తగిరులు గోవింద నామాలతో నిరంతరం మారుమోగుతున్నాయని పేర్కొన్నారు. కలియుగంలో తిరుమలలో వేంకటేశ్వర స్వామిగా అవతరించారని వివరించారు. మద్దాళి ఉషా గాయత్రి శిష్యులు ప్రదర్శించిన ‘వినరో భాగ్యం, శ్రీమన్నారాయణ, నారాయణతే నమో, నమో, విన్నపాలు వినవలె, గోవిందా శ్రీత’ తదితర అంశాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మెన్ బాదిమి శివకుమార్, అన్నమాచార్య భావన వాహిని అధ్యక్షులు డా.శోభారాజు, సంస్థ అధ్యక్షురాలు మద్దాళి ఉషాగాయత్రి, కినె్నర కార్యదర్శి మద్దాళి రఘురామ్ పాల్గొన్నారు.