హైదరాబాద్

ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి పరిష్కరణ దిశగా అడుగులు వేయాలని అధికారులను హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ జీ.రవి ఆదేశించారు. నాంపల్లిలోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జేసీ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి ఉపాధి కల్పన, రుణాలు, ఇళ్లు, పెన్షన్లు మొదలైన అంశాలపై వచ్చిన ఫిర్యాదులను జిల్లా రెవెన్యూ అధికారి భూపాల్ రెడ్డితో కలిసి స్వీకరించారు. రవి మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేయలని ఆదేశించారు. వివిధ శాఖలలో 34 పిటీషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సికింద్రాబాద్, హైదరాబాద్ ఆర్డీఓలు రాజాగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, డీఈఓ వెంకట నర్సమ్మ, సీపీఓ రామభద్రం పాల్గొన్నారు.