హైదరాబాద్

భక్తిశ్రద్ధలతో గురుపూర్ణిమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గురుపూర్ణిమ పర్వదిన వేడుకలు మంగళవారం నగరంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. గురుపూర్ణిమ శ్రీ షిరిడీ సాయిబాబా పుట్టినరోజు కావటంతో నగరంలోని సాయిబాబా ఆలయాలు ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడాయి. పేరుగాంచిన దిల్‌సుఖ్‌నగర్, నయాపూల్, పంజాగుట్ట, పద్మారావునగర్, హుమాయున్‌నగర్‌లోని పోచమ్మబస్తీలోని సాయిబాబా దేవాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుఝము నుంచే భక్తులు బాబాకు అభిషేకాలు, అర్చనలు నిర్వహించిన ఆరాధించారు. మధ్యాహ్నాం కొన్ని దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాలు, సాయంత్రం పలు దేవాలయాల్లో సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహించారు.
మెరుగైన వైద్యం పేదలకు అందాలి
గురుపూర్ణిమ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీసత్యసాయి సేవా సంస్థలు కోఠి విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఉస్మాన్‌గంజ్‌లో ఉచిత హోమియో క్లీనిక్‌ను నిర్వహించారు. శిబిరాన్ని సత్యసాయి సేవా సంస్థల నగర అధ్యక్షుడ ఏ.మల్లేశ్వర రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. రోగులను హోమియో వైద్యులు డా.జి. దుర్గాప్రసాద రావు, వీవీ లక్ష్మి పరీక్షించారు. డా.దుర్గాప్రసాద రావు మాట్లాడుతూ డాక్టర్స్‌డే రోజున వేడుకల్లో పాల్గొన్న తనను స్వామివారి సందేశానికి ఆకర్షితుడనై, పేదలకు కూడా మెరుగైన వైద్యం అందించాలన్న సంకల్పంతో ఉచిత హోమియో క్లీనిక్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సత్యసాయి సేవా సంస్థల కోఠి విభాగం అధ్యక్షుడు పీ.విశే్వశ్వర శాస్ర్తీ మాట్లాడుతూ ఈ క్లీనిక్ ప్రతి మంగళవారం ఉదయం పదకొండు గంటల నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎక్కిరాల కృష్ణమాచార్య పాల్గొన్నారు.