హైదరాబాద్

చినుకుపడితే కూడళ్లన్నీ చెరువులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మహానగరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లు చినుకుపడితే చాలు చిన్నసైజు చెరువులను తలపిస్తున్నాయి. కేవలం మెయిన్‌రోడ్లే గాక, సబ్ రోడ్లు, కాలనీ రోడ్ల పరిస్థితి సైతం దాదాపు ఇలాగే తయారైంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి కురిసిన వర్షానికి నగరంలోని కూడళ్లలో గంటల తరబడి వర్షపు నీరు భారీగా నిలవటంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. సుమారు రెండు దశాబ్దాలుగా నగరంలోని పలు మెయిన్‌రోడ్లలో, కూడళ్లలో చినుకుపడిచే భారీగా వర్షం నీరు నిలుస్తున్నా, ఇక్కడ అధికారులు ఎప్పటికపుడు మోటార్లను ఏర్పాటుచేసి నీటి తోడేయటం వంటి తాత్కాలిక పరిష్కారాలను సూచిస్తున్నారే తప్పా, సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ విఫలమవుతూనే ఉంది. లక్డీకాపూల్‌లోని లక్కీ హోటల్ చౌరస్తా, హోటల్ ఉడ్ బ్రిడ్జి ముందున్న మెయిన్ రోడ్డు, మహావీర్ ఆసుపత్రి సమీపంలోని ఓ ప్రార్థన మందిరం, లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆసుప్రతి ముందున్న జంక్షన్‌తో పాటు పంజాగుట్ట, విల్లామేరీ కాలేజీ చౌరస్తా, బేగంపేట, బైబిల్ హౌజ్ రైల్వే బ్రిడ్జి, రాణిగంజ్ చౌరస్తాల్లోని హెల్మెట్ షాపు ముందు చిన్నపాటి వర్షం పడిందంచే చాలు భారీగా వర్షపు నీరు నిలిచిపోతోంది. హోటల్ ఉడ్ బ్రిడ్జి ముందు, లక్కీహోటల్ చౌరస్తాల్లో సుమారు ఇరవై ఏళ్ల నుంచి నీరు నిలుస్తుండగా, ఎప్పటికపుడు ప్రతి వర్షాకాలం అధికారులు లక్షలాది రూపాయలు వెచ్చించి చిన్నపాటి పనులు చేపడుతున్నారే తప్పా, శాశ్వత పరిష్కారాన్ని సమకూర్చకపోవటంతో వాహనదారులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. లక్కీహోటల్ చౌరస్తాలో వాటర్ స్టాగినేట్ కాకుండా శాశ్వత చర్యలు చేపట్టామని అధికారులు చెబుతున్నా, చిన్న పాటి వర్షానికే ఇక్కడ భారీగా నీరు నిలుస్తోంది. ఫలితంగా పనులు శాస్ర్తియంగా చేపట్టలేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమీర్‌పేట మైత్రి వనం కూడలి వద్ద కూడా సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని అధికారులు గతంలో చెప్పినా, ప్రస్తుతం చిన్నపాటి వర్షానికి అక్కడ కూడా భారీగా నీరు నిలుస్తోంది.