హైదరాబాద్

30వేల డస్ట్‌బిన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మహానగరంలో ఎక్కడా కూడా రోడ్డుపై చెత్త పడకుండా నూటికి నూరు శాతం పరిశుభ్రత, స్వచ్ఛతను సాధించే అంశంపై అధికారులు దృష్టి సారించారు. నగరంలోని పలు మెయిన్‌రోడ్లు, రద్దీ ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా వెలసిన చిరువ్యాపారులు చెత్తను అక్కడికక్కడే వదిలేసి వెళ్తున్నట్లు, వర్షం కురిసినపుడు అది వరద నీటి కాలువులు, డ్రేనేజీల్లో నీటి ప్రవాహానికి ప్రధాన అడ్డంకిగా మారుతుందన్న విషయాన్ని గుర్తించిన అధికారులు తొలుత చిరువ్యాపారులను వారంతట వారే డస్ట్‌బిన్లను ఏర్పాటు చేసుకోవాలని, అందులోని చెత్తను బల్దియా సిబ్బంది సేకరిస్తుందని చెప్పారు. చాలా మంది వ్యాపారులు డస్ట్‌బిన్లను ఏర్పాటు చేసుకోకపోవటంతో నగరంలోని రెండు వేల కిలోమీటర్ల మెయిన్‌రోడ్డులో గుర్తించిన సుమరు 30వేల మంది చిరువ్యాపారులకు బల్దియానే డస్ట్‌బిన్లను అందించాలని నిర్ణయించింది. చిరువ్యాపారులు తాము ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా డస్ట్‌బిన్లను ఎంపిక చేసి, వాటిని విక్రయించే ఏజెన్సీల రేట్లను కూడా వ్యాపారులకు తెలియజేస్తోంది. ఐదు రోజులుగా ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. రూ.300 నుంచి రూ.500 వరకు లభించే ఈ డస్ట్‌బిన్ల సమాచారాన్ని వ్యాపారులకు అందిస్తున్నారు. హోం కంపోస్టింగ్‌ను ప్రోత్సహించేందుకు వీలుగా వెయ్యి రూపాయల విలువ చేసే కంపోస్టు ప్లాస్టిక్ బిన్‌ను నగరవాసులకు బల్దియా అందుబాటులో ఉంచింది. ముందుగా వ్యాపారులు వారంతట వారే వీటిని ఏర్పాటు చేసుకునేలా చైతన్యపరుస్తూ, ఆ తర్వాత కొంత సమయం ఇచ్చి నోటీసులు జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత కూడా వ్యాపారుల్లో మార్పు రాకపోతే భారీగా జరిమానాలు వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రముఖ పర్యాటక స్థలమైన గోల్కొండ, చార్మినార్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వీధివ్యాపారులు చాలా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ డ్రైవ్‌లోనే భాగంగా 50 మైక్రాన్ల కంటే తక్కువ మైక్రాన్లతో ఉండే ప్లాస్టిక్ కవర్లను వినియోగించే వ్యాపారులకు వెంటనే జరిమానాలు విధించాలని కమిషనర్ దాన కిషోర్ ఆదేశాలు జారీ చేశారు.