హైదరాబాద్

శివార్లలో మరో 200 సిగ్నల్స్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మహానగరంలో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్‌ను గాడిన పెట్టేందుకు సరికొత్త టెక్నాలజీతో ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలపై అధ్యయనం చేయాలని నగర ట్రాఫిక్ ఇంప్యాక్ట్ అసెస్‌మెంట్ అంశంపై గురువారం జరిగిన సమావేశంలో పోలీసు, జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయించారు. ఈ సందర్భంగా కమిషనర్ దాన కిషోర్ మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం 221 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయని, హైదరాబాద్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బీఇఎల్ వీటిని నిర్వహిస్తుందని తెలిపారు. వచ్చే నవంబర్ మాసాంతానికి నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ కాంట్రాక్టు ముగియనున్నట్లు తెలిపారు. ఇటీవలే గ్రేటర్ హైదరాబాద్‌లో ముఖ్యంగా శివారు ప్రాంల్లో వచ్చిన గణనీయమైన ప్రగతి నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిష్నరేట్‌ల పరిధిలో కొత్తగా మరో 200 ట్రాఫిక్ సిగ్నళ్లను ఏర్పాటు చేయాలని ఆయా కమిష్నరేట్ల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతమున్న ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ సంతృప్తికరంగా లేదని ట్రాఫిక్ అధికారులతో పాటు పులువురు ట్రాఫిక్ నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ నేపథ్యంలో బెంగుళూరులో ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణపై అధ్యయనం చేయటంతో పాటు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణను చేపట్టిన బీఇఎల్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ చీఫ్ ఇంజనీర్‌తో పాటు ట్రాఫిక్ అధికారులతో కూడిన కమిటీని పంపనున్నట్లు తెలిపారు. కమర్షియల్ ప్రాంతాల్లో షాపింగ్ కాంప్లెక్సులు, మల్టీప్లెక్సులు, సినిమా హాళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చే సమయంలో స్థానిక ట్రాఫిక్ ఇంప్యాక్ట్ అసెస్‌మెంట్‌ను ట్రాఫిక్, ఆర్టీసి అధికారులతో అధ్యయనం చేయించి, ఆయా విభాగాలకు సూచనల
మేరకు అనుమతులు ఇవ్వాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ప్రతిపాదించారు. ముఖ్యంగా రెస్టారెంట్లకు సరైన పార్కింగ్ సౌకర్యం లేదని, రెస్టారెంట్లకు వచ్చే వారి భద్రతకు విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటం లాంటి నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా నిబంధనలు అమలు చేయాలని సూచించారు. సైబరాబాద్ పోలీసు కమిష్నరేట్‌లో గుర్తించిన 16 అత్యంత సమస్యాత్మక ముంపు ప్రాంతాల నివారణకై చర్యలను చేపట్టామని జీహెచ్‌ఎంసీ ఇంజనీర్లు వెల్లడించారు. సమావేశంలో భాగంగా ట్రాఫిక్ ఇంప్యాక్ట్ అసెస్‌మెంట్‌పై ‘లీ’ సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్ ఎస్. దేవేందర్‌రెడ్డి, ఇంజనీర్లు శ్రీ్ధర్, జియావుద్దిన్, సురేశ్‌కుమార్, హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ మోహన్‌సింగ్ హాజరయ్యారు.