హైదరాబాద్

మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : జిల్లాలో 16 మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు రంగారెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్ రెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో మున్సిపల్ 2019 ఎన్నికల పై ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఎంపిక చేసిన 40 మంది (మాస్టర్ ట్రైనర్స్) ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పారు. 21వ తేదిన మిగిలిన సిబ్బందికి డివిజన్ స్థాయిలో శిక్షణ ఇస్తారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 1092 మంది ప్రిసైడింగ్, 1093 అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, మొత్తం 3231 మంది సిబ్బంది మున్సిపల్ ఎన్నికల విధులలో పాల్గొననున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలలో 622270 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని చెప్పారు. పురపాలికల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ విధానంతో జరుగుతాయని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క నియమ నిబంధనలను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో సత్యనారాయణ, సీపీవో ఓంప్రకాష్ పాల్గొన్నారు.