హైదరాబాద్

ఇక భవనాల ఆస్తిపన్ను తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్‌ఎంసీని గట్టెక్కించేందుకు అధికారులు అందుబాటులో ఉన్న అన్ని ఆదాయ మార్గాలను సద్వినియోగం చేసుకునేందుకు సిద్దమయ్యారు. నగరంలోని 30 సర్కిళ్ల పరిధిలో వెయ్యి గజాలు, అంతకంటే ఎక్కువ స్థలంలో నిర్మించిన కమర్షియల్ భవనాలకు చెల్లిస్తున్న ఆస్తిపన్ను వివరాలపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. వాస్తవానికి కమర్షియల్ లావాదేవీలు కొనసాగుతున్న భవనాలు కమర్షియల్ అనుమతులు తీసుకుని నిర్మించినవా? లేక రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని నిర్మించుకున్న తర్వాత కమర్షియల్‌గా వినియోగిస్తున్నారా? అన్న విషయాలను క్షేత్ర స్థాయిలో గుర్తించేందుకు వీలుగా ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ తెలిపారు. ఇందుకుగాను ప్రత్యేకంగా టాస్క్ఫోర్సు బృందాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ముఖ్యంగా నగరంలోని కమర్షియల్ భవనాల్లో అనుమతి పొందిన వాటి కన్నా అధిక సంఖ్యలో నిర్మాణాలున్నాయని, భవనాల ఆస్తిపన్ను నిర్థారణలో కూడా వ్యత్యాసాలున్నట్లు ఫిర్యాదులు కూడా అందుతున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ తనిఖీలకు గాను టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో ఒక్కో జోన్‌కు ప్రత్యేకంగా ఒక టాస్క్ఫోర్సును ఏర్పాటు చేసి తనిఖీలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ తనిఖీలను సంబంధిత జోనల్ కమిషనర్లు, జోనల్ సిటీ ప్లానర్లు, డిప్యూటీ కమిషనర్లు కూడా ప్రత్యక్షంగా చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అనుమతులు పొందిన కమర్షియల్ భవనాల కన్నా అధిక సంఖ్యలో భవనాలుండటం, చట్టపరంగా చెల్లించాల్సిన ఆస్తిపన్ను కన్నా తక్కువగా చెల్లించటం, కమర్షియల్ చెల్లించాల్సి ఉండగా, దాన్ని రెసిడెన్షియల్‌గా చెల్లిస్తూ బల్దియాను మోసం చేస్తున్న యజమానులపై అసరమైతే కేసులు కూడా నమోదు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు కమిషనర్ పేర్కొన్నారు.
ఈ నెల ఆస్తిపన్ను లక్ష్యం రూ.123 కోట్లు
జీహెచ్‌ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లకు సంబంధించి జూలై మాసంలో రూ. 123 కోట్లను వసూలు చేయాలని ట్యాక్సు సిబ్బందికి టార్గెట్ విధించినట్లు కమిషనర్ దాన కిషోర్ తెలిపారు.