హైదరాబాద్

విద్య దోపిడీని అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న విద్య దోపిడీని అరికట్టాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గిరిజన శక్తి ఆధ్వర్యంలో కార్పొరేట్ విద్య - ప్రైవేటీకరణ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. గిరిజన శక్తి వ్యవస్థాపకులు వెంకటేష్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి గిరిజన శక్తి గౌరవ అధ్యక్షుడు రాజేష్ నాయక్, విద్యార్థి సంఘాల నాయకులు శరత్ నాయక్, భరత్, వెంకన్న, పాండు, వెంకన్న పాల్గొని మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు. కనీస ప్రమాణాలు పాటించకుండా కాలేజీలను కొనసాగిస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పోరాటాలతో ఏర్పడ్డ తెలంగాణలో విద్య వ్యవస్థలో మార్పులు వస్తాయని భావించిన ఎలాంటి మార్పులు రాలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ చట్టం కాదు, కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని నిలువరించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సి ఉందని అన్నారు. పేద వర్గాలకు విద్యను దూరం చేసే విధంగా ఉన్న విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.