హైదరాబాద్

సమాజానికి సాహిత్యం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : సమాజానికి సాహిత్యం ఎంతో అవసరమని తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహాకవి డా.దాశరథి కృష్ణమాచార్య 95వ జయంతి వేడుకలను సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్థాపించిన ‘సాహితీ పురస్కారం’ ప్రదానోత్సవ కార్యక్రమం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని దాశరథి చిత్ర పటానికి నివాళి అర్పించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడిన తరువాత మహానీయుల జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని పేర్కొన్నారు. దాశరథి ప్రజల అవేదన గుర్తించి రచనలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 70 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు మహానీయుల జయంతి చేయలేదని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై కొంతమంది ఆసత్య ప్రచారలు చేస్తున్నారని అన్నారు. ఆసరా పెన్షన్‌తో ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలిపారు. సాహిత్యన్ని నమ్ముకున్న వ్యక్తి కురెళ్ళ విఠలాచార్య అని కొనియాడారు. మరుమూల గ్రామంలో ఉన్న విఠటాచార్యను ప్రభుత్వం గుర్తించి దాశరథి పురస్కారం ప్రదానం చేయడం అభినందనీయమని అన్నారు. హోంమంత్రి మహమ్ముద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ కోసం నిజామ్‌కు వ్యతిరేకంగా పొరాటం చేసిన వ్యక్తి దాశరథి అని కీర్తించారు. అతని పేరిట కూరెళ్ల విఠలాచార్యకు పురస్కారం ప్రదానం చేయడం సంతోషదాయకమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా.నందిని సిధారెడ్డి, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాదిమి శివకుమార్, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.