హైదరాబాద్

మరింత వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : వృద్ధులకు ప్రభుత్వం సహాయం అందించేందుకు అమలు చేస్తున్న ‘ఆసరా’ అర్హుల వయస్సును ప్రభుత్వం 57 ఏళ్లకు కుదించటంతో నగరంలోని ఈ పథకానికి అర్హులైన లబ్దిదారులను గుర్తించేందుకు బల్దియా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు 64 ఏళ్ల వయస్సు వారికి అందించే పెన్షన్ ఇకపై 57 ఏళ్ల వయస్సు కలిగిన వారిని కూడా అర్హులుగా ప్రభుత్వం ప్రకటించటంతో బల్దియా అధికారులు ఇప్పటికే 57 నుంచి 64 ఏళ్ల మధ్య వయస్సు ఓటర్ల వివరాలను అధికారులకు అందించినట్లు, ఇందులో 57 నుంచి 64 ఏళ్ల మధ్య వయస్సు వారిని మార్కింగ్ చేసుకుని, ఇంటింటి సర్వే నిర్వహించేందుకు మొత్తం 175 బృందాలను సిద్ధం చేసినట్లు కమిషనర్ దాన కిషోర్ సోమవారం వెల్లడించారు. ఈ బృందాలు నగరంలోని 30 సర్కిళ్లలో ఇంటింటి సర్వే నిర్వహించి, ఓటరు జాబితాలో ఉన్న సమాచారాన్ని క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసుకుని, లబ్ధిదారుడు ఉన్నట్లు గుర్తించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఈ పెన్షన్ల అర్హుల ముసాయిదా జాబితాను ఈనెల 25లోపు పూర్తి చేసేందుకు వీలుగా ఒక్కో బృందానికి రోజువారిగా గుర్తించాల్సిన లబ్ధిదారుల సంఖ్యకు తగిన విధంగా లక్ష్యాలు విధించినట్లు కమిషనర్ వెల్లడించారు.
స్వయం సహాయక సంఘాలు మరింత బలోపేతం
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న సుమారు 45వేల స్వయం సహాయక బృందాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. స్వయం సహాయక బృందాల మహిళల్లో అత్యధిక శాతం నిరుపేదలే ఉన్నారని, వారిని ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్, సాఫ్ హైదరాబాద్-షాన్‌దార్ హైదరాబాద్ కార్యక్రమాల్లో మహిళలు చురుకుగా పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రతి బుధవారం నాడు ఒక్కో సర్కిల్‌కు చెందిన ఈ స్వయం సహాయక బృందాల సమావేశాలు నిర్వహించి, సంబంధిత కార్పొరేటర్లు, డిప్యూటీ కమిషనర్లు తప్పనిసరిగా సమావేశాలకు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అవసరమైతే స్థానిక ఎమ్మెల్యేలు కూడా సమావేశానికి ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి స్థారుూ సంఘం కమిటీలో ఆమోదం పొందనున్నట్లు తెలిపారు.

వర్షాలు కురుస్తాయి

హైదరాబాద్, బేగంపేట, జూలై 22: అందరినీ చల్లంగా చూస్తున్నా.. ఇంకా చల్లంగా చూస్తా.. నాకు ఐదు వారాలు పప్పు, బెల్లంతో నైవేథ్యం సమర్పించి, సాక పెట్టండి.. వర్షాలకు ఢోకాలేదు.. సంవృద్ధిగా కురుస్తాయి.. అని ఆమ్మోరు పూనిన స్వర్ణలత భవిష్యవాణిలో పేర్కొన్నారు. సికిందరాబాద్ శ్రీఉజ్జయినీ మహంకాళీ బోనాల మరుసటి రోజైన సోమవారం ఉదయం ఆలయం ఆవరణలో రంగం కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా, ఘనంగా నిర్వహించారు. ఉదయానే్న ఆమ్మోరికి ప్రత్యేక పూజలు నిర్వహించినానంతరం అమ్మవారు పూనిని తర్వాత స్వర్ణలత పచ్చికుండపై నిల్చుండి భవిష్యవాణి విన్పించారు. ఐదువారాల పాటు పొలిమేర హద్దుల్లోనే ఈ నైవేథ్యం సమర్పించాలని సూచించారు. తనకు మారు బోనం సమర్పించాలని, ఈసారి కూడా వర్షాలు సంవృద్ధిగా కురిపించి, అందరినీ చల్లంగా చూస్తానని సెలవిచ్చారు. తన తల్లి గంగాదేవికి జల పూజలు చేసి, కొలవాలని భక్తులకు సూచించారు. అనంతరం బలిగంప ఊరేగింపు, విచిత్రమైన నాట్యవిన్యాసాలతో పోతరాజుల గావు కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. రంగం రోజైన సోమవారం కూడా శ్రీఉజ్జయినీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు కిటకిటలాడారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.