హైదరాబాద్

మధుర గాయనీ సుశీల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : మధుర గాయనీ పీ.సుశీల అని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కొనియాడారు. సుప్రసిద్ధ కవులు ‘దాశరథి - సినారె’ జయంతి సందర్భంగా సుప్రసిద్ధ గాయనీ పీ.సుశీలకు ‘దాశరథి - సినారె’ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్‌వెల్ కార్పోరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొని సుశీలకు పురస్కారం ప్రదానం చేశారు. సుశీలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉందని పేర్కొన్నారు. సంగీతం మానవులకే పరిమితం కాదని, ప్రతి జీవికి సంగీతం అవసరమని అన్నారు. మాటలతో సాధించలేనిది, పాటతో సాధించవచ్చని తెలిపారు. పాటలకు ఎంతో శక్తి ఉందని, సుశీల ప్రేక్షక హృదయాల్లో పదిలమైన స్థానం సంపాదించుకున్నారని వివరించారు. పాటలతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని తెలిపారు. గాయనీ పీ.సుశీల మాట్లాడుతూ, తనకు మళ్లీ పాడాలని ఉందని అన్నారు. ప్రముఖ గాయనీ ఆమని నిర్వహణలో గాయనీ, గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి. వైకే నాగేశ్వర రావు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో సీల్‌వెల్ కార్పొరేషన్ చైర్మన్ బండారు సుబ్బారావు, శృతిలయ ఆర్ట్స్ చైర్మన్ ఆర్‌ఎన్ సింగ్, మద్దెల శివకుమార్, డా.బొక్కా భీమ్‌రెడ్డి, కుసుమ భోగరాజు, సంస్థ అధ్యక్షురాలు ఆమని పాల్గొన్నారు.

శ్రీనివాస్‌కు ఆత్మీయ సత్కారం
కాచిగూడ, జూలై 23: గాయకుడు ఎం.శ్రీనివాస్‌కు ఆత్మీయ సత్కార కార్యక్రమం రాగరాగిణి ఆర్ట్స్ అసోసియేషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత ఆచార్య ఎన్.గోపీ పాల్గొని శ్రీనివాస్‌కు ఆత్మీయ సత్కారం చేశారు. శ్రీనివాస్ బ్యాంక్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తునే సంగీత రంగంలో రాణించడం అభినందనీయమని అన్నారు. ఆకాశవాణి, దూరదర్శన్ వేదికలపై 1200 కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు. శ్రీనివాస్‌ను సత్కరించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. భీమన్న సాహితీ నిధి అధ్యక్షురాలు హైమవతి భీమన్న సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రముఖ సినీనటుడు గిరిబాబు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, యలవర్తి రాజేంద్ర ప్రసాద్, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎంవీ సుబ్బాలక్ష్మీ, ఎంవీ రమణకుమారి పాల్గొన్నారు.
అలరించిన సినీ సంగీత విభావరి
కాచిగూడ, జూలై 23: శారద మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి మంగళవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి పాల్గొని గాయకులను అభినందించి సత్కరించారు. ప్రముఖ గాయనీ, గాయకులు సినీ నేపథ్య గాయకుడు చంద్రతేజ, శారద నిర్వహణలో గాయనీ, గాయకులు బాపిరాజు, లక్ష్మీ పద్మజ, సాయిపావని, చంద్రజ్యోతి, నర్మద, గంటి శైలజ, గంటి రామకృష్ణ, టీవీ రావు, గంటి వెంకటేశ్వర రావు, మల్లికార్జున రావు అలపించిన సినీ గీతాలు అలరించాయి.
యక్షగాన కళను బతికించుకోవాలి
కాచిగూడ, జూలై 23: చిందు యక్షగాన కళను బతికించుకోవాలని తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బీ.శివకుమార్ అన్నారు. దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో ‘చిందు యక్షగాన’ మహోత్సవ కార్యక్రమం మంగళవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శివకుమార్ పాల్గొని కళాకారులను అభినందించి సత్కరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కళలకు పెద్దపీట వేస్తుందని వివరించారు. చిందు భాగవతానికి గతంలో ఎంతో ఆదరణ ఉండేదని పేర్కొన్నారు. గానసభ ప్రాచీన కళలు, కళాకారులను ప్రొత్సహించడం అభినందనీయమని అన్నారు. పిల్లిట్ల కృష్ణయ్య బృందం ‘మాన్‌దాత’ చిందు యక్షగానం ఆకట్టుకుంది. శ్రీత్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, గానసభ ఉపాధ్యక్షుడు సీహెచ్‌వీ ప్రసాద్ పాల్గొన్నారు.