హైదరాబాద్

జాతీయ విద్యావిధానంపై విస్తృత చర్చ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : విద్యావిధానంలో మార్పులు తీసుకువచ్చేందుకు కస్తూరి రంగరాజన్ కమిటీ కేంద్రానికి సమర్పించిన జాతీయ విద్యా విధానం-2019పై విస్తృతంగా చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ పీఎల్ విశే్వశ్వర రావు, డాక్టర్ సత్తార్ ఖాన్, గోవింద రావు మాట్లాడారు. ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు తీసుకువచ్చేందుకు నియమించిన కస్తూరి రంగరాజన్ కమిటీ విద్యా విధానంలోని లోపాలను ఎత్తిచూపుతూనే తిరిగి ప్రభుత్వం ఆశించిన విధంగా నివేదిక అందజేసినట్టు ఉందని అన్నారు. ప్రైవేట్ విద్యను సమర్థించే విధంగా నివేదిక రూపొందించడం విచారకరమని అన్నారు. ఒక దేశ భవిష్యత్ ఆ దేశంలో కొనసాగుతున్న విద్యావిధానంపై ఆధారపడి ఉంటుందన్న విషయాలను విస్మరించారని తెలిపారు. స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు పూర్తిచేసుకున్నా ఇప్పటికీ ప్రాథమిక విద్యకు సైతం నోచుకోని లక్షలాది మంది చిన్నారులు బాలకార్మికులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విద్యావిధానం దేశంలో కొనసాగుతుందని, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ యూనివర్సిటీలంటూ గందరగోళానికి గురిచేస్తున్నారని వాపోయారు. బడ్జెట్‌లో విద్యకోసం భారీ కేటాయింపులు ఉండాల్సి ఉండగా అలా జరగడం లేదని అన్నారు. విద్యకు బడ్జెట్ ఎంత ఉండాలన్న స్పష్టత ఇవ్వక పోగా నాణ్యత కోసం ప్రైవేట్ విద్యాసంస్థలు అవసరం అన్న భావనలో నివేదికను పొందుపరిచిందని తెలిపారు. యావత్ దేశ విద్యావిధానంలో మార్పులు తీసుకువచ్చేందుకు తయారుచేసిన నివేదికను కొన్ని భాషల్లోనే అందుబాటులో ఉంచడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. సమగ్ర నివేదికను అన్ని బాషల్లోకి అనువాదం చేసి అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించిన అనంతరమే మార్పులు చేపట్టాలని డిమాండ్ చేశారు.