తెలంగాణ

ప్రతి ఫైల్‌కు ఒక్కరోజే గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: రాష్ట్రంలో ఒక నియోజక వర్గానికి ఒక మినీ ట్యాంక్‌బండ్‌ను మాత్రమే మంజూరు చేయనున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతెలిపారు. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, జిల్లాల్లో కొనసాగుతున్న మిషన్ కాకతీయ పనుల పురోగతిపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫైలును అధికారులు ఒక్కరోజు కన్నా ఎక్కువ ఉంచుకోవడానికి వీలులేదని అన్నారు. జెఇ నుంచి మంత్రి వరకు ఒక్క రోజులోనే ఫైల్ పూర్తి కావాలని అన్నారు. వారం రోజుల్లో ఫైల్ పని పూర్తి కావాలని అన్నారు. రాష్ట్రంలో కోటి రూపాయల కన్నా తక్కువ ఉన్న మిషన్ కాకతీయ మొదటి దశ పనులను 2016 మార్చి నాటికి పూర్తి చేయాలని, కోటి రూపాయల పైన ఉన్న పనులను జూన్ 30 వరకు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. మిషన్ కాకతీయ రెండవ దశ పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. దేశం అంతా మిషన్ కాకతీయ వైపు చూస్తోంది కాబట్టి అధికారులు బాధ్యతగా చిత్తశుద్ధితో పని చేయాలని అన్నారు. మిషన్ కాకతీయ ఫస్ట్‌ఫేజ్‌లో అలసత్వం ప్రదర్శిస్తున్న ఏజెన్సీల పట్ల కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. పనిచేయని వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని, అవసరమైతే తొలగించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఇంకా మొదలుకాని పనులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని కోరారు. మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని అన్నారు. చెరువుల్లో ఈతకు వెళ్లి మృత్యువాత పడుతున్నారని ఇలాంటి సంఘటనలకు కారణం అవుతున్న బొందలను పూడ్చాలని తెలిపారు.

సచివాలయంనుంచి మంగళవారం అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు