హైదరాబాద్

ఎగ్జిబిషన్లతో చేనేతకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : వివిధ నగరంలో కొలువుదీరుతున్న ఎగ్జిబిషన్లతో చేనేతకు ఎంతగానో ప్రోత్సాహం లభిస్తుందని తెలుగు రాష్ట్రాల సిల్క్ బ్రాండ్ అంబాసిడర్ శైలజా రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాజ్‌కృష్ణలో ఏర్పాటు చేసిన ట్రెండ్జ్ వివాహ్ ఎగ్జిబిషన్‌ను నిర్వాహకురాలు శాంతితో కలిసి ప్రారంభించారు. మాట్లాడుతూ చేనేతకారులు వారి ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునే అవకాశం ఎగ్జిబిషన్లతో లభిస్తుందని అన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా విక్రయాలు జరపడంతో వారు ఆర్థికంగా బలపడతారని అన్నారు. రెండు రోజుల పాటు కొనసాగే ఎగ్జిబిషన్‌లో దేశంలోని విశిధ ప్రాంతాలకు చెందిన చేతివృత్తులను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
అలరించిన సినీ సంగీత విభావరి
కాచిగూడ, ఆగస్టు 13: వరుణ్ ఆర్ట్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ‘సినీ సంగీత’ విభావరి మంగళవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. గాయకుడు వరుణ్ ఆలపించిన అలనాటి సినీ గీతాలు అలరించాయి. వరుణ్ జాన్సన్ గ్రామర్ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతూ సంగీతంతో పాటు పెయింటింగ్‌లో రాణించడం అభినందనీయమని గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి కొనియాడారు. భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి వరుణ్ చేరుకోవాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో వరుణ్ తల్లిదండ్రులు ఎస్.వేణు, వాసంతి పాల్గొన్నారు.