హైదరాబాద్

వీధి వ్యాపారులపై మరో పిడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : డస్ట్‌బినే్న కదా అనుకుంటే పొరపాటు. బల్దియా డస్ట్‌బిన్ల దందా కొందరికి కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తోంది. మహానగరంలోని మెయిన్ రోడ్లకిరువైపులా చిన్నాచితక వ్యాపారాలను ఏర్పాటు చేసుకుని జీవనం గడుపుతున్న వీధి వ్యాపారులపై అధికారులు ‘స్వచ్ఛ’ పేరిట మరో పిడుగు పడింది. మెయిన్ రోడ్లలోని వీధి వ్యాపారులు డస్ట్‌బిన్లను ఏర్పాటు చేసుకోకపోవటంతోనే వాటివల్ల ఏర్పడిన వ్యర్థాలు వర్షం కురిసినపుడు వరద నీటి కాలుల్లోకి చేరి, వర్షపు నీటి ప్రవాహానికి అడ్డుపడుతోందంటూ, ఇందుకు ప్రతి వీధి వ్యాపారి ఖచ్చితంగా డస్ట్‌బిన్లను ఏర్పాటు చేసుకోవల్సిందేనంటూ అధికారులు విధించిన నిబంధన పట్ల కొందరు చిరువ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే డస్ట్‌బిన్లను ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు సైతం తాము విక్రయించే డస్ట్‌బిన్‌ను కొనాల్సిందేనంటూ బల్దియా అధికారులు తీవ్ర వత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముషీరాబాద్ క్రాస్‌రోడ్డులో ఓ హోటల్ యజమాని తమ హోటల్‌లో ఉత్పత్తి అయ్యే చెత్తను నిల్వ చేసేందుకు సొంతగా డస్ట్‌బిన్‌ను ఏర్పాటు చేసుకోగా, అది చెల్లదంటూ తాము విక్రయించే డస్ట్‌బిన్ కొనాల్సిందేనని బల్దియా అధికారులు వత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక మొక్కజొన్న కంకిలు విక్రయించే చిరువ్యాపారులు తమ వద్ద పోగయ్యే చెత్తను నిల్వ చేసేందుకు ప్లాస్టిక్ కవర్లు వంటివి ఏర్పాటు చేసుకున్నా, అవేమీ కుదరవంటూ తాము విక్రయించే డస్ట్‌బిన్‌ను తప్పకుండా కొనాల్సిందేనని అధికారులు వత్తిడి చేస్తున్నట్లు కొందరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. అరటి పండ్లు విక్రయించే తోపుడు బండ్ల వ్యాపారులు కూడా డస్ట్‌బిన్లను కొనుగోలు చేయాలని అధికారులు వత్తిడి చేస్తున్నట్లు వ్యాపారులు వాపోతున్నారు. తమ వద్ద కాయలు కొనుక్కుని వినియోగదారులు వెళ్లిపోతారని, తమవద్ద ఎలాంటి చెత్తాచెదారం పోగు కాదని, అలాంటపుడు తామెందుకు ఈ బిన్లను కొనుగోలు చేయాలని మరికొందరు వాదిస్తున్నారు. ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ, నోరు బొంగురు పోయేలా అరుస్తూ విక్రయిస్తే తమకు రూ.400 నుంచి రూ.ఐదు వంద వరకు మిగులుతున్నాయని, పైగా ఒక చోట నిలవకుండా సంచరిస్తూ విక్రయించే తమకు ఈ బిన్ ఎలా ఉపయోగపడుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.