హైదరాబాద్

30 నుంచి ‘స్నాక్స్ ఫెస్టివల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : మహానగరంలో మెట్రోరైలుపై ప్రజలు ప్రయాణించేలా, ఆకర్షితులను చేసేందుకు అధికారులు మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈనెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు మూడురోజుల పాటు స్నాక్స్ ఫెస్టివల్ పేరిట ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహించనున్నట్లు హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం బేగంపేట మెట్రోరైలు భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని కల్చర్ లాంగ్వేజీ ఇండియన్ కనెక్షన్స్, మెట్రోరైలు, ఎల్ అండ్ టీ, తెలంగాణ టూరిజం, రాష్ట్ర భాషా,సాంస్కృతిక శాఖల సంయుక్త్ధ్వార్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఫెస్టివల్‌లో భాగంగా నగరంలోని ఉప్పల్, అమీర్‌పేట, హైటెక్‌సిటీ, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లలో ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలతో ఈ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు వివరించారు. సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాలకు విదేశీయులు కూడా పాల్గొనవచ్చునని తెలిపారు. సీఎల్‌ఐసీ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ ఇదివరకు ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహణ స్ఫూర్తితో ఈ స్నాక్స్ ఫెస్టివల్‌ను మెట్రోరైలు మొట్టమొదటి సారిగా నగరంలో నిర్వహిస్తోందని తెలిపారు. వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు, కళాకారులు ఒక వేదికపై మహిళా సాధికారత, తెలంగాణ పండుగ సంక్రాంతి సంబరాలు వంటి అంశాలకు సంబంధించి ప్రదర్శనలివ్వనున్నట్లు తెలిపారు. వివిధ వర్గాలకు చెందినవారు ఈ ఫెస్టివల్ తమ సాంప్రదాయక వంటకాలను ప్రదర్శించి, విక్రయించనున్నట్లు కూడా ఆయన తెలిపారు. సమావేశంలో అభిజిత్ భట్టాచార్జీ, వీణారెడ్డి పాల్గొన్నారు.