హైదరాబాద్

వాస్తవాన్ని స్థిరపరిచేదే ఫొటోగ్రఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, : వాస్తవాన్ని స్థిరంగా భద్రపరిచేది ఫొటోగ్రఫీ అని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. అంతర్జాతీయ ఛాయాచిత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు జే.రాములుకు జీవన సాఫల్య పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రోశయ్య పాల్గొని పురస్కారాలను ప్రదానం చేశారు. అందరూ ఇష్టపడే కళ ఛాయాచిత్ర కళ అని అన్నారు. ప్రముఖ కవి రఘుశ్రీ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సంస్థ అధ్యక్షురాలు పాలపర్తి సంధ్యారాణి పాల్గొన్నారు.

అలరించిన సినీ సంగీత విభావరి
కాచిగూడ, ఆగస్టు 16: మాధురి మ్యూజికల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ‘పుణ్యభూమి నాదేశం నమోనమామి’ పేరిట సినీ సంగీత విభావరి శుక్రవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, గానసభ కమిటి సభ్యుడు బండి శ్రీనివాస్, యలవర్తి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కరించారు. గాయకుడు రవికుమార్ నిర్వహణలో గాయనీ, గాయకులు గాయత్రి, రేణుక, చందన, కవిత, రజిత, త్రినాథ్ పోల, కామేష్, రవికాంత్ అలపించిన సినీ గీతాలు అలరించాయి.
జ్ఞానంతోనే మోక్షం
కాచిగూడ, ఆగస్టు 16: జ్ఞానంతో మోక్షం లభిస్తుందని మహా సహస్రాధాని డా.గరికపాటి నరసంహా రావు అన్నారు. సౌత్ ఇండియా కల్చరల్ అసోసియేషన్, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో డా.గరిపాటి నరసింహా రావుతో ‘రామాయణంలో రహస్యాలు’ తెలుగులో ప్రవచనలు శుక్రవారం రామకృష్ణమఠంలో నిర్వహించారు. అన్ని భయాలను జయించేది జ్ఞానం మాత్రమేనని పేర్కొన్నారు. ఎంతో పవిత్రమైదని భారతీయ సంస్కృతి అని వివరించారు. మసస్సులో ఏర్పాడే కోరికలే మనిషి పతనానికి కారణం అవుతుందని తెలిపారు. రామాయణంలోని రహస్యాలను ప్రతి భారతీయుడు తెలుసుకోవాలని సూచించారు. గరికపాటి నరసింహా రావుతో మూడు రోజుల పాటు ప్రవచనలు నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు డా.ఎస్.చక్రవర్తి, ఆర్.చక్రపాణి తెలిపారు.