హైదరాబాద్

మరో 90 కొత్త ట్రాఫిక్ సిగ్నల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : మహానగరంలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు ప్రస్తుతమున్న సిగ్నల్స్‌తో పాటు కొత్తగా మరో 90 ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయనన్నట్లు బల్దియా కమిషనర్ దాన కిషోర్ వెల్లడించారు. శుక్రవారం ఆయన నగరంలో ట్రాఫిక్ నిర్వహణ విధానం(హెచ్‌ట్రీమ్స్)పై ట్రాఫిక్ పోలీసులతో ప్రత్యేకంగా సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అన్ని ప్రాంతాల్లో కలిపి సుమారు 221 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయని, వీటిలో 86 సిగ్నల్స్ మాత్రమే మెరుగ్గా పనిచేస్తున్నాయని, మరో 80 స్వల్ప సమస్యలతో పనిచేస్తున్నాయని తెలిపారు. మెట్రోరైలు, యూ టర్న్ తదితర కారణాలతో 55 సిగ్నల్స్ పనిచేయటం లేదని తెలిపారు. ప్రస్తుతమున్న 221 ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ బాధ్యత భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్(బీఈఎల్)కు అప్పగించామని, ఈ సంస్థ టెండర్ కాలం నవంబర్ మాసంతో ముగియనున్నట్లు తెలిపారు. సకాలంలో బీఈఎల్ నిర్వహణపరమైన నిధులను విడుదల చేయకపోవటం, తగు సిబ్బందిని నియమించుకోకపోవటంతో ప్రస్తుతం నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ ఆశాజనకంగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతమున్న మొత్తం 221జంక్షన్లలోని ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నింటిపై తిరిగి సర్వే నిర్వహించి, ఆగస్టు మాసం చివరి కల్లా పూర్తి స్థాయిలో పనిచేసేలా బీఈఎల్ చర్యలు చేపట్టాల్సి ఉండగా, ఈ విషయంలో ఏ మాత్రం పురోగతి లేకపోవటం పట్ల బీఈఎల్ అధికారులపై కమిషనర్ దాన కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 221 జంక్షన్లలో కేవలం 70 ట్రాఫిక్ సిగ్నళ్ల పనితీరుపై మాత్రమే సర్వే నిర్వహించారని, మిగిలిన 151 ట్రాఫిక్ జంక్షన్ల పినతీరుపై పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించటానికి జీహెచ్‌ఎంసీ నుంచి దాదాపు 25 మంది అసిస్టెంటు ఇంజనీర్లు, ఇందుకు కావల్సిన ల్యాడర్లను బీఎల్‌కు కేటాయించాలని చీఫ్ ఇంజనీర్ సురేశ్‌కుమార్‌ను కమిషనర్ ఆదేశించారు. మూడురోజుల్లోగా ఈ మిగిలిన ట్రాఫిక్ సిగ్నళ్ల సర్వే పూర్తి చేయాలని తెలియజేశారు. ప్రస్తుతమున్న 221 ట్రాఫిక్ సిగ్నళ్లకు అదనంగా ట్రాఫిక్ విభాగం సూచించిన మేరకు ఏర్పాటు చేసే మరో 90 ట్రాఫిక్ సిగ్నళ్లన్నింటిని నిర్వహణ, నిర్మాణాలకు నిధులతో పాటు పరిపాలన సంబంధిత మంజూలు చేయాలని ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలు పంపించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు. అత్యంత ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో వీటి నిర్వహణ చేపట్టేందుకు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో అమలవుతున్న విధానం, నిర్వహణ తీరుపై జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ అధికారులు ఇప్పటికే అధ్యయనం చేసినట్లు కమిషనర్ తెలిపారు.