హైదరాబాద్

రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై ఐక్య పోరాటాలకు సిద్ధం అవుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రవీందర్ పేర్కొన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ డీలర్లు తమ సమస్యలను పరిష్కరించాలని ఏళ్ల తరబడి పోరాటాలు చేస్తున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని అన్నారు. వేరు వేరుగా పోరాడుతున్న సంఘాలన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే అన్ని సంఘ కమిటీలను రద్దు చేసి అడహక్ కమిటీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈనెల 25న నగరంలో అడహక్ కమిటీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి అదే రోజు రాష్ట్ర స్థాయి కమిటీకి ఎన్నిక నిర్వహించనున్నట్టు తెలిపారు. సమావేశంలో అజీజ్ బాషా, తిరుపతి, సాయిలు, సత్తయ్య, నరేందర్, బాలనర్సయ్య పాల్గొన్నారు.