హైదరాబాద్

అక్రమ నల్లా కనెక్షన్లపై ఇక క్రిమినల్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో జలమండలి చేస్తున్న నీటి సరఫరాకు అనుకూలంగా ఆదయాన్ని సమకూర్చుకునేందుకు జలమండలి అధికారులు అందుబాటులో ఉన్న అన్ని ఆదాయ మార్గాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా అక్రమ నల్లా కనెక్షన్లను గుర్తించే పనిలో నిమగ్నమై ఉన్నారు. అక్రమంగా నల్లా కనెక్షన్లను గుర్తిస్తే, యజమానిపై ఏకంగా క్రమినల్ కేసులను నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం పేట్ బషీర్‌పేట్‌లో జలమండలి నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండా ఇద్దరు యజమానులు రెండు భవనాలకు అక్రమంగా నీటి కనెక్షన్‌ను తీసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన విజిలెన్స్ అధికారులు జలమండలి ఎండీ దాన కిషోర్ ఆదేశాల మేరకు సదరు వ్యక్తులు వెంకటరమణ, శంకరయ్యలపై క్రిమినల్ కేసులను నమోదు చేశారు. అక్రమ నల్లా కనెక్షన్లు కల్గి ఉండటం, నల్లాలకు మోటార్లను భిగించటం వంటివి గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ కు ప్రత్యేక బృందాలను కూడా సిద్దం చేస్తున్నారు. ఈ బృందాలు తనిఖీలు నిర్వహించి, కఠిన చర్యలు చేపట్టనున్నట్లు ఎండీ దాన కిషోర్ తెలిపారు.