హైదరాబాద్

తెలుగు సంస్కృతిని తెలియజేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : తెలుగు సంస్కృతిని చిన్నతనం నుంచే పిల్లలకు తెలియజేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు అన్నారు. బాల మణిహారం, కళా జాగృతి సంయుక్త ఆధ్వర్యంలో ‘బాల గోపాలం - కృష్ణాష్టమి’ వేడుకలు ఆదివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వకుళాభరణం కృష్ణమోహన రావు పాల్గొని ప్రసంగించారు. చిన్నారులను కళా రంగాల్లో ప్రొత్సహిస్తే కళలు ఎంతో గొప్పగా వరిల్ల్లుతాయని పేర్కొన్నారు. చిన్నారుల్లో దాగివున్నన ప్రతిభను గుర్తించి ఆయా రంగాల్లో ప్రొత్సహించాలని సూచించారు. ప్రముఖ కవి డా. ఎం కే రాము సభాధ్యక్షత వహించిన ప్రముఖ రచయిత్రి శశిబాల, అదరణ సేవా సమితి అధ్యక్షుడు నాగేశ్వర రావు, పీఎన్ మూర్తి, సీనియర్ పాత్రికేయుడు రత్నాకర శర్మ పాల్గొన్నారు.