హైదరాబాద్

గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మహానగర ప్రజలు పదకొండు రోజుల పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకునే గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనానికి నగరంలో భారీ ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ నగర పోలీసు శాఖలు సమష్టిగా నిర్ణయించారు. వచ్చే నెల 2వ తేదీన ప్రారంభమై 12వ తేదీన జరగనున్న నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అన్ని ప్రభుత్వ శాఖలు భారీగా ఏర్పాటు చేయాలని ఉభయ శాఖల అధికారులు భావిస్తున్నారు. నిమజ్జన కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీలోని కమాండ్ కంట్రోల్ రూం నుంచి ఎప్పటికపుడు పర్యవేక్షించటంతో పాటు ఎన్టీఆర్ మార్గ్‌లో సెంట్రలైజ్‌డ్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేయాలని బల్దియా అధికారి ముషారఫ్, పోలీసు అధికారులు చౌహాన్, కమలేశ్వర్, విశ్వప్రసాద్ తెలిపారు. నిమజ్జనంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాలని ఉభయ శాఖల అధికారులు పేర్కొన్నారు. గత సంవత్సరం కన్నా అదనపు ఏర్పాట్లను చేయనున్నట్లు తెలిపారు. 9, 10రోజుల్లో జరిగే నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై 21 క్రేన్లను ఏర్పాటు చేయనున్నట్లు, చివరి రోజైన 11వ రోజు నిమజ్జన కార్యక్రమానికి క్రేన్ల సంఖ్యను 29కి పెంచాలని భావిస్తున్నారు. ఈ శోభయాత్రకు అదనంగా 37వేల లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారి ముషారఫ్ అలీ తెలిపారు. శోభాయాత్ర జరిగే మార్గాలన్నింటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు ముందుగానే చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. శానిటేషన్‌ను పకడ్బందీగా చేపట్టేందుకు ప్రత్యేక సిబ్బందిని, గణేష్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీతో పాటు హైదరాబాద్ మెట్రోరైలు, జాతీయ రహదారులు, హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కూడా తమ పరిధిలోని రహదారులకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. గత సంవత్సరం కన్నా ఈ సారి అధికంగా క్రేన్‌లు, మొబైల్ క్రేన్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై జోనల్ స్థాయిలో సమన్వయ సమావేశాన్ని నిర్వహించాలని ఇప్పటికే మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దాన కిషోర్ ఆదేశించారని తెలిపారు. జలమండలి ఆధ్వర్యంలో 32లక్షల వాటర్ ప్యాకెట్లను పంపణీ చేయటంతో పాటు పలు మార్గాల్లో ప్రత్యేక వాటర్ క్యాంప్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 32 ప్రాంతాల్లో 894 క్రేన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.