హైదరాబాద్

సంపూర్ణ స్వచ్ఛత సాధిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో సంపూర్ణ స్వచ్ఛతను సాధిస్తామని, ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు, చుక్క నీరు వృథాకాకుండా పరిరక్షించుకునేందుకు జలమండలి ఆధ్వర్యంలో ప్రత్యేక వాక్ నిర్వహిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ దాన కిషోర్ వెల్లడించారు. సుస్థిరమైన పారిశుద్ద్యం అనే అంశంపై ఢిల్లీలో జరుగుతున్న వర్క్‌షాప్ రెండోరోజు కార్యక్రమంలో కమిషనర్ నగరానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికల సమర్పించారు. ఈ సందర్భంగా నగరంలో మంచినీటి పరిరక్షణ కోసం, స్వచ్ఛతను సాధించుకునేందుకు చేపట్టిన కార్యక్రమాలపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ వర్క్‌షాప్‌లో పారిశుద్ద్య నిర్వహణ, ఎస్టీపీల ద్వారా మురుగునీరు శుద్ధి, వర్షపు నీటి పొదుపు పార్కులు, వాక్ వంటి అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా జలమండలి తీసుకువచ్చిన సంస్కరణల గురించి వర్క్‌షాప్‌లో ప్రస్తావిస్తూ మురుగునీటి వ్యవస్థ నిర్వహణ సవాళ్లు, వాటి పనితీరు రూపొందించాల్సిన అవసరం వంటి విషయాలను వివరించారు. మురుగు నిర్వహణలో కార్మికులకు శిక్షణ వంటి అంశాలను పేర్కొన్నారు. మంచినీరు వృథా కాకుండా పరిరక్షించుకునేందుకు వీలుగా వాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వయం సహాయక బృందాలు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లతో పాటు మొత్తం 6300 వాలంటీర్లను నీటి సంరక్షణ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర హౌజింగ్, పట్టణ వ్యవహారాల కార్యదర్శి దుర్గాశంకర్ కమిషనర్ దాన కిషోర్‌ను అభినందించారు. ఇప్పటికే ఉన్న థీమ్ పార్కుకు తోడు అదనంగా ఐదు పార్కులు నిర్మించటం పట్ల ప్రశంసించారు. ఓడీఎఫ్ ప్లస్, ఘన వ్యర్థాల నిర్వహణ, వ్యర్థ నీటి నిర్వహణ వంటి అంశాల్లో హైదరాబాద్ నగరం ఇతర మహానగరాలకు ఆదర్శంగా నిలుస్తోందిన దుర్గాశంకర్ వ్యాఖ్యానించారు. ఈ వర్క్‌షాప్‌లో ఘన వ్యర్థాలు, ఇప్పటికే ఉన్న ఎస్టీపీల్లో వ్యర్థ జలాల శుద్ధి నిర్వహణ అంశంపై జలమండలి ఈడీ ఎం.సత్యనారాయణ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ వర్క్‌షాప్‌లో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి హర్వీందర్‌సింగ్, స్వచ్ఛ్భారత్ మిషన్ జాయింట్ సెక్రటరీ వీ.కే. జిందాల్ పాల్గొన్నారు.