హైదరాబాద్

ప్రజా ఫిర్యాదులు పట్టవా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్‌ఎంసీని గట్టెక్కించేందుకు అధికారులు అందుబాటులో ఉన్న అన్ని ఆదాయ మార్గాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా నగర ప్రజలకు అవసరమైన, అత్యవసరమైన సేవలను అందిస్తూ, కావల్సిన అభివృద్ధి పనులు చేపడుతూనే సామాన్యుల ఫిర్యాదులను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత బల్దియాపైనే ఉన్నా, ప్రస్తుతం బల్దియా సిబ్బంది కేవలం జరిమానాలు, ఆస్తిపన్ను వసూళ్లకే పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏళ్ల తరబడి జీహెచ్‌ఎంసీ సర్కిల్, జోన్లు, ప్రధాన కార్యాలయ చుట్టూ తిరుగుతున్న పౌరులను పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు, ఫిర్యాదులు రాకుండా మెరుగైన సేవలు అందించేలా విధులు నిర్వర్తించాల్సిన బల్దియా సిబ్బంది, అధికారులకు పౌరసేవలకు సంబంధించిన ఫిర్యాదులను చేసినా, పట్టించుకునే వారే లేరని ఫిర్యాదులు సమర్పించేందుకు వచ్చిన కొందరు వాపోతున్నారు. నగరంలో సంపూర్ణ స్వచ్ఛత పేరుతో ‘సాఫ్ హైదరాబాద్-షాన్‌దార్ హైదరాబాద్’ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతను ఉల్లంఘించే వారిని గుర్తించి జరిమానాలు వసూలు చేస్తున్నారు. రోడ్ల, చెరువుల్లో చెత్త వేసేవారిని, నీటిని వదిలేవారితో పాటు రకరకాలుగా జరిమానాలు విధిస్తున్నారు. స్వచ్ఛత పట్ల ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఈ రకమైన చర్యలను సమర్థిస్తున్న పౌరులు, వసూళ్లపై చూపుతున్న శ్రద్ధ ప్రజాఫిర్యాదుల పరిష్కారంలోనూ చూపాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ జరిమానాలకు సంబంధించి శానిటరీ సూపర్‌వైజర్, జవాన్లు మొదలుకుని ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్లు, మెడికల్ ఆఫీసర్లతో పాటు డిప్యూటీ కమిషనర్లకు కూడా రోజువారీ టార్గెట్లు ఇవ్వటంతో, లక్ష్యాన్ని పూర్తి చేసుకునేందుకు అధికారులు చిన్నాచితక వ్యాపారులపై పడుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా, అక్రమ నిర్మాణాల్లో, ప్రజాభద్రత కోసం ఏర్పాటు చేయాల్సిన ఫైర్ సేఫ్టీ వంటి వ్యవస్థల్లేని భవనాల్లో కొనసాగుతున్న బడాబాబులు, రాజకీయ నాయకుల వ్యాపారాల జోలికెళ్లని అధికారులు రోడ్డుకిరువైపులా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని, జీవనం గడిపే తోపుడు బండ్లకు జరిమానాలు విధించి, తమ ప్రతాపాన్ని చూపుతున్నారు.
ఆస్తిపన్ను నెలవారీ టార్గెట్లు
కార్పొరేషన్‌లో ప్రస్తుతం నెలకొన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ ఏట ఆస్తిపన్నును వీలైనంత ముందుగా వసూలు చేసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. పన్ను వసూళ్లలో కీలక పాత్ర పోషించే బిల్ కలెక్టర్లు, ట్యాక్సు ఇన్‌స్పెకర్లు, వ్యాల్యుయేషన్ ఆఫీసర్లతో ఇదివరకు వార్షిక టార్గెట్లు ఇవ్వగా, ఇపుడు కమిషనర్ తాజాగా నెలవారీ టార్గెట్లు ఇచ్చి, ప్రతిరోజు సమీక్షిస్తున్నారు. ఈ టార్గెట్లు క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు విరుద్దంగా ఉన్నట్లు కొందరు అధికారులు వాపోతున్నారు. నిర్మాణాలు ఎక్కువగా జరిగే రాజేంద్రనగర్ సర్కిల్‌కు రూ. 2 కోట్ల పన్ను వసూలును టార్గెట్‌గా విధించగా, అంతంతమాత్రంగా నిర్మాణాలు కొనసాగే సికందరాబాద్ సర్కిల్‌కు రూ. 7 కోట్లను లక్ష్యంగా పెట్టినట్లు సమాచారం. కొత్తగా నిర్మాణాలు జరిగే సర్కిల్‌లోనే రూ. 2 కోట్లను వసూలు చేసేందుకు అధికారులు అష్టకష్టాలు పడుతుంటే, అంతంతమాత్రంగా నిర్మాణాలు జరిగే సికిందరాబాద్ సర్కిల్‌లో రూ.7 కోట్లు లక్ష్యంగా పెట్టడమేమిటీ? అని కొందరు ట్యాక్సు సిబ్బంది వాపోతున్నారు.