హైదరాబాద్

భూగర్భ జలాల సంరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : భూగర్భ జలాలు కాపాడుకునేందుకు ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టాలని కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ, మిషన్ డైరెక్టర్ వీకే జిందాల్ అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో జలశక్తి అభియాన్ పథకం కింద జిల్లాలో జూలై నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మిషన్ డైరెక్టర్ వీకే జిందాల్ మాట్లాడుతూ సెప్టెంబర్ నెల చివరి వరకు జలశక్తి అభియాన్ లక్ష్యాలను పూర్తి చేయాలని చెప్పారు. చేసిన పనిని ఎప్పటికప్పుడు ఫొటో తీసి సంబంధిత వివరాలను అప్‌డేట్ చేయాలని అన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాల్లో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. స్కూల్, కళాశాలలో నీటి ఆవశ్యకతను గురించి తెలియజేసే విధంగా క్విజ్ కాంపిటేషన్స్, పెయింటింగ్, ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. నీటిని పొదుపుగా వాడుకోవడం, వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడం, భూగర్భ జలాలు పైకి రావడానికి తీసుకోవాల్సిన చర్యలు, వృథా నీటిని తిరిగి ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జల్‌శక్తి అభియాన్‌తో నీటి వనరుల పెంపు, వర్షం నీటిని ఒడిసిపట్టండి.. భూగర్భ జలాలు సంరక్షించాలని, వర్షపు నీటిని కాపాడుకోవడం ప్రతిఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. ఇంటింటికీ ఇంకుడుగుంతలు, బోర్ల రీచార్జ్, చెరువులు, బావుల్లో పూడికతీత, కందకాలు తవ్వడం, చెక్‌డ్యామ్‌లు నిర్మించడం, మొక్కలు నాటడం వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.
భూగర్భ వనరులను కాపాడేందుకు ప్రతిఒక్కరిలో అవగాహన తీసుకురావాలని చెప్పారు. భవిష్యత్‌లో వచ్చే నీటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యలను అధిగమించేందుకు కేంద్రం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, ఇటీవల చెన్నైలో ఎదుర్కొంటున్న నీటి పరిస్థితులను గుర్తు చేశారు. దేశంలో జలవనరుల కొరతను తీర్చడంతో పాటు నీటి వనరులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం జల్‌శక్తి అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. వర్షాకాలంలో ప్రతినీటి బొట్టును వృథా పోనీయకుండా కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పీడీ డీఆర్‌డీఏ ప్రశాంత్ కుమార్, డీపీఓ పద్మజారాణి, హార్టికల్చర్ అధికారి సునంద పాల్గొన్నారు.