హైదరాబాద్

మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కుషాయిగూడ - ఈసీఇఎల్ రహదారులపై మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశించారు. బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కాప్రా, ఈసీఐఎల్, నేరేడ్‌మెట్, లాలాపేట్, నాగారం తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ వ్యవస్థ ఏర్పాటు, జంక్షన్ల నిర్మాణం, అదనపు ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, మెరుగైన ప్రయాణినికి యూటర్న్‌ల ఏర్పాటు వంటి అంక్షాలపై ట్రాఫిక్, ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఇసీఐఎల్, కూషాయిగూడ వంటి ప్రాంతాలు శర వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అక్కడి ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పించాల్సి ఉందని అన్నారు. ఇందు కోసం నాగారం నుంచి ఈసీఐఎల్ వరకు ఉన్న మార్గాల్లో ట్రాఫిక్ వ్యవస్థను పటిష్టం చేయడం, ఆధునిక సిగ్నళ్ల ఏర్పాటు, యూటర్న్‌లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణంతో పాటు ఫ్రీ లెఫ్ట్‌లను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాలని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అధికారులతో పాటు హెచ్‌ఎండీఏ, ఆర్టీసీ, పోలీస్ తదితర శాఖల అధికారులతో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్టు తెలిపారు. ఈసీఐఎల్ చౌరస్తాలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ ఐ ల్యాండ్‌ను వాహనాల రద్దీకి అనుగుణంగా మార్పులు చేపడటంతో పాటు సుందరీకరించాలని సూచించారు. ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించి వాహనాలు, పాదాచారుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రజా రవాణ వ్యవస్థను మెరుగుపరిచే కార్యక్రమాల్లో భాగంగా కుషాయిగూడ చర్లపల్లిలో ఆధునాత బస్‌బేల ఏర్పాటు, అన్నపూర్ణ కేంద్రాలను ఏర్పాట్టు చేయనున్నట్టు తెలిపారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌కు వెళ్లే భారీ గార్బేజ్ వాహనాలను వౌలాలీ హౌసింగ్ బోర్డు కాలనీ ద్వారా కాకుండా ఎన్‌ఎఫ్‌సీ కేబుల్ చైరస్తా మీదుగా జవహర్‌నగర్‌కు మళ్లించాని ట్రాఫిక్ పోలీసులు విన్నవించగా ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా జీహెచ్‌ఎంసీ ట్రాన్స్‌పోర్ట్ విభాగాన్ని కోరతామని మేయర్ తెలిపారు.