హైదరాబాద్

అపూర్వ ప్రక్రియ ‘వెంట్రిలోక్విజమ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : అపూరమైన ప్రక్రియా వెంట్రిలోక్విజమ్ (మాట్లాడే బొమ్మ) అని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మెన్ డా.అయాచితం శ్రీ్ధర్ అన్నారు. మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ‘వెంట్రిలోక్విజమ్ ఫెస్ట్’ బుధవారం చిక్కడపల్లి గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అయాచితం శ్రీ్ధర్ పాల్గొని కళాకారులను అభినందించి సత్కరించారు. వెంట్రిలోక్విజయ్ కళలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి అదరణ ఉందని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు ఫెస్ట్‌ను ఏర్పాటు చేసి కళాకారులను ప్రొత్సహించడం అభినందనీయమని అన్నారు. ప్రముఖ మెజీషీయన్ చొక్కాపువెంకట రమణ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో సామాజిక వేత్త డా.కొత్తకృష్ణవేణి, నేరెళ్ల రాధాకృష్ణ, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ మల్లం రమేష్, సంస్థ అధ్యక్షుడు మిమిక్రీ చంద్రముఖి చంద్రశేఖర్ పాల్గొన్నారు.