హైదరాబాద్

పేదల ఆకలి తీర్చే సరికొత్త ప్రయత్నమే ఫీడ్ ది నీడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, : పేదల ఆకలి తీర్చేందుకు ఓ మంచి ప్రయత్నం ఫీడ్ ది నీడ్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ భాగస్వామ్యంతో ఆపిల్ హోమ్ సంస్థ నగరవ్యాప్తంగా పలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అమీర్‌పేట మైత్రీవనం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాన్ని శుక్రవారం మంత్రి శ్రీనివాస యాదవ్ ప్రారంభించారు. నగరానికి నిత్యం వేలాది మంది బాటసారులు, జీవనోపాధి కోసం పేదలు వస్తుంటారని వారి ఆకలి తీర్చడానికి ఫీడ్ ది నీడ్ కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. నగరంలో అనేక హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయని వాటిలో నిత్యం ఎంతో ఆహారం వృథా అవుతుందని అన్నారు. వాటిని బయటపడేయకుండా ఫీడ్ ది నీడ్ కేంద్రానికి తరలిస్తే భద్రపరుస్తారని తెలిపారు. షీ నీడ్ ద్వారా శానిటరీ ప్యాడ్‌లను అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. నీలిమా ఆర్యా చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో యాపిల్ హోం వ్యవస్థాపకురాలు నిలీమా, స్థానిక కార్పొరేటర్ శేష కుమారి పాల్గొన్నారు.
బీరప్ప స్వామి కల్యాణోత్సవం
ఉప్పల్, ఆగస్టు 23: రామంతాపూర్ కేసీఆర్‌నగర్‌లో శ్రీబీరప్ప స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో కన్నుల పండువగా జరిగింది. ఆలయ 6వ వార్షికోత్సవం సందర్భంగా కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది మహిళలు డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య బోనాలతో ర్యాలీగా వచ్చి స్వామికి బోనం సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్, సంఘం ప్రతినిధులు రేవు కృష్ణయ్య, రేవు నర్సింహ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇద్దరు చిన్నారుల మృతి
పరిగి, ఆగస్టు 23: తమ్ముడిని దుబాయ్ పంపించడానికి వచ్చిన కుటుంబంలో ఊహించని విధంగా విషాదఛాయలు అలుము కున్నాయి. ఇంటి ముందు మరుగు దొడ్డికోసం తీసిన గోతిలో ఇధ్దరు చిన్నారులు పడి మునిగి చనిపోయారు. వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇబ్రాహీంపూర్ గ్రామంలో జరిగింది. ఇబ్రాహీం పూర్ గ్రామానికి చెందిన నయిబ్, అబీబ్, అన్నదమ్ములు నయిద్ తమ్ముడు అభీబ్ శుక్రవారం రాత్రి దుబాయ్ వెళ్ల్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. తమ్ముడు అభీబ్‌ను దుబాయ్ సాగనంపేందుకు చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో తన చెల్లెలు రహీస బేగం గురువారం రాత్రి ఇభ్రాహీం పూర్ గ్రామానికి వచ్చింది. శుక్రవారం ఉదయం అబీబ్ దుమాయ్ పోయే ఏర్పాట్లలో అందరు ఉన్నారు. నయిబ్ కొడుకు నభీన్(6), రహీస భేగం కొడుకు అయాన్(8) కలసి ఇంటి ముందర గుంత ఆ గుంతలో నీరు వచ్చింది. ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందారు. పరిగి ఎస్‌ఐ చంద్రకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.