హైదరాబాద్

మరణిస్తూ మరో ముగ్గురికి జీవితాల్లో వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : తాను మరణిస్తూ మరో ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపాడో మాజీ సైనికుడు. ఎస్.పార్వతీశం (38) మాజీ సైనికుడు. మల్కాజ్‌గిరి గౌతమ్‌నగర్‌లో నివాసం ఉండే ఇతనికి భార్య రత్నప్రభ, కుమారుడు అశ్రీత్ (14) ఉన్నారు. భార్య గృహిణి కాగా, కుమారుడు అశ్రీత స్థానికంగా ఉన్న పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 19న ఉదయం 9:30గంటలకు పార్వతీశం హైబీపీకి గురి అయ్యాడు. తక్షణమే కుటుంబ సభ్యులు అతన్ని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అతనికి చికిత్సలు అందించేందుకు ప్రయత్నించినా అతని శరీరం సహకరించలేదు. మరో మారు వైద్యుల బృందం పూర్తిస్థాయిలో పరిశీలించి బ్రెయిన్ డెడ్‌కు గురి అయినట్టు నిర్ధారించారు. జీవన్‌దాన్ ప్రతినిధులు భార్య రత్నప్రభతో పాటు కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు. అతనికి ప్రత్యేక చికిత్సలు నిర్వహించి రెండు కిడ్నీలు, లివర్‌ను సేకరించి అవసరమైన వారికి అమర్చారు.