హైదరాబాద్

డ్రోన్ సహాయంతో మహాగణపతి నిమజ్జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : రాష్ట్రంలోనే కాక దేశంలోనే ప్రతిష్టాత్మక వినాయకుడిగా పేరొందిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి ఈ ఏడాది డ్రోన్ సాంకేతికతను వినియోగించునున్నారు. ప్రతీ ఏడాది భారీ గణనాథుడు పూర్తిస్థాయిలో నిమజ్జనం కాకపోవడంతో భక్తులు చాలా సేపు అక్కడే ఉండిపోవడంతో పాటు ఇతరత్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని హుస్సెన్‌సాగర్‌లోని ఏ ప్రాంతంలో గౌరీతనయుడ్ని నిమజ్జనం చేయాలన్న అంశాన్ని డ్రోన్‌ల ద్వారా తెలుసుకోనున్నారు. ఆదివారం హుస్సెన్ సాగర తీరన డ్రోన్ సాంకేతికతతో నిమజ్జనాన్ని చేయాలన్న అంశాన్ని మేయర్ బొంతు రామ్మోహన్ వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.