హైదరాబాద్

నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: ఖైరతాబాద్ కొలువుదీరిన శ్రీద్వాదశాధిత్య మహాగణపతి నిమజ్జన ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో వినాయక మండపాన్ని సందర్శించారు. నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు చెప్పారు. 12వ తేదీ ఉదయం ఏడు గంటల కల్లా మహాగణపతి ఉరేగింపు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు ఎన్‌టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 6వద్దకు చేరుతుందని అన్నారు. భాగ్యనగర్ ఉత్సవ కమిటీతో పాటు పలువురు అభ్యర్థన మేరకు ఈ ఏడాది గణనాధుడు పూర్తిస్థాయిలో నిమజ్జనం అయ్యేలా హుస్సెన్ సాగర్‌లోని సిల్ట్‌ను తొలగించినట్టు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు మంత్రి సూచించారు.