హైదరాబాద్

నగరంతో కోడెలకు విడదీయరాని బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : నవ్యాంధ్ర మొట్టమొదటి శాసనసభాపతి, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌కు మహానగరంతో విడదీయని బంధం ఉంది. సమైక్యాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు ఆయన వైదారోగ్యశాఖ మంత్రిగా చేపట్టిన ప్రత్యేక చొరవతో నగరంలోని పలు ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపడగా, మరికొన్ని కొత్తగా నిర్మితమై, అత్యాధునిక సేవలతో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. పిల్లలు, గర్బిణుల వైద్యంల ఆసియా ఖండంలోనే పేరుగాంచిన నిలోఫర్ ఆసుపత్రి పాతభవనం ముందు ఎదురుగా ఇన్ఫోసిస్ కంపెనీ రూ.3 కోట్లను వెచ్చించిన కొత్త బ్లాకును నిర్మించటంలో కోడెల శివప్రసాద్ ప్రత్యేక చొరవ చూపించారు. అప్పటి వరకు నిలోఫర్ ఆసుపత్రిలో అంతంతమాత్రంగా అందుతున్న కార్డియాలజీ సేవలు ఈ బ్లాక్ అందుబాటులోకి రావటంతో మరింత మెరుగుపడ్డాయి. దీంతో పాటు శిథిలావస్థలో కొనసాగుతున్న గాంధీ భవనాన్ని ముషీరాబాద్ జైలున్న స్థలంలోకి మార్చి, అక్కడ ఆధునిక హంగులతో, సువిశాలంగా గాంధీ ఆసుపత్రిని కొత్తగా నిర్మించి అందుబాటులోకి తేవటంలో కోడెల తనదైన పాత్ర పోషించారని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా క్యాన్సర్ వ్యాధి చికిత్సకు ఓ ఆసుపత్రి ఉండాలనే ఆలోచన వచ్చిన అప్పటి ప్రభుత్వం కోడెల సలహా మేరకే బంజారాహిల్స్‌లో బసవతారం క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించింది. ఈ ఆసుపత్రికి తెలుగు రాష్ట్రాలకు చెందిన క్యాన్సర్ రోగులే కాకుండా, ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి చికిత్స పొందుతుంటారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడల్లా నగరానికి చెందిన ఎంతో మంది యువ కార్యకర్తలకు నేతలకు కోడెల రాజకీయంగా దిశానిర్దేశం చేసేవారని, ఓ వైద్యుడిగా కూడా పార్టీ శ్రేణులు తమ ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పలు సమావేశాల్లో సూచించేవారని పలువురు టీడీపీ నేతలు గుర్తుచేసుకున్నారు.

శ్రీసత్యసాయి సేవా కంటి శిబిరానికి స్పందన

హైదరాబాద్, సెప్టెంబర్ 16: శ్రీసత్యసాయి సేవా సంస్థలు కోఠి సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి శిబిరానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. కోఠి సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని అసిస్టెంట్ పోలీసు కమిషనర్ (అసెంబ్లీ విభాగం) రాందాస్ తేజ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఏడాది పొడువున ప్రజలకు వివిధ రకాల సేవలను అందిస్తున్న సేవా సమితి కార్యక్రమాలను అభినందించారు. సర్వేంద్రియానం నయనం ప్రదానం అని శరీరంలోని అన్ని అంగముల్లో కళ్లు ప్రదానమని, మన కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో ప్రముఖ కంటి వైద్యులు, లిబర్టీ ఆప్షన్స్ ప్రొపరైటర్ డా.ఆదిత్య మొత్తం 91 మంది వివరాలను నమోదు చేసుకుని, తర్వాత 66 మందికి కంటి జోళ్లు అవసరమని వైద్యులు నిర్థారించారు. మరో 12 మందికి ముందులను రాసి ఇచ్చి తగిన సూచనలు చేశారు. సేవా సంస్థలు కోఠి విభాగం సమితి కన్వీనర్ పీ.విశే్వశ్వరశాస్ర్తీ మాట్లాడుతూ ప్రజలకు వైద్య, విద్యా తదితర రంగాల్లో ఏడాది పొడువున పలు సేవా కార్యక్రమాలను అందిస్తున్నట్లు తెలిపారు.

ఆంధ్రభూమి బ్యూరో