హైదరాబాద్

అన్ని జ్వరాలు.. డెంగ్యూ కావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : సీజనల్ వ్యాధుల్లో భాగంగా వచ్చే జ్వరాలన్నీ డెంగ్యూ వ్యాధికి సంబంధించినవి కావనే విషయాన్ని మహానగర ప్రజలు గుర్తించాలని నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ అన్నారు. నల్లకుంటలోని ఫీవర్, గాంధీ ఆసుపత్రుల్లో వివిధ వ్యాధుల బారిన పడి చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న సేవలపై అధికారులతో చర్చించారు. ఈ రెండు ఆసుపత్రులను సందర్శించి, రోగులకు అందుతున్న సేవలపై రోగులను కూడా అడిగి తెల్సుకున్నారు. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ఫీవర్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఔట్ పేషెంటు అదనపు కౌంటర్లను, సౌకర్యాలను పరిశీలించినట్లు తెలిపారు. ప్రతి జ్వరం డెంగ్యూకు సంబంధించింది కాదని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కేవలం ఎలీసా పరీక్షా ద్వారానే డెంగ్యూ వ్యాధి నిర్దారణ అవుతోందని వివరించారు. గాంధీ ఆసుపత్రి ఎంఆర్‌ఓతో ప్రత్యేకంగా సమావేశమై ఆసుపత్రికి వచ్చే ఔట్ పేషెంట్ రోగులకు అందిస్తున్న సౌకర్యాలు, అదనంగా ఏర్పాటు చేసిన కౌంటర్లు వంటి అంశాలపై చర్చించారు.